జెనీలియా డిసౌజా పేరు చెప్పగానే అందం, అమాయకపు చిరునవ్వు, అల్లరి, ముద్దుగుమ్మ అనిపించేది మొదట గుర్తొచ్చే పదాలు. ఈ బ్యూటీ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషలలో నటించి ప్రేక్షకులను తన నటనతో, అందంతో ఆకట్టుకుంది. చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ జెనీలియా.
హీరోయిన్ జెనీలియా
జెనీలియా 2003లో బాలీవుడ్ చిత్రం తుఝే మేరీ కసమ్ ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. ఆ సినిమాలో తన సహజమైన నటనతో, అందమైన అభినయంతో ఆమెపై ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
తెలుగు సినిమాల్లో
అయితే, తెలుగు సినిమాల్లో కూడా మంచి గుర్తింపు పొందింది. ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే, హీరో తరుణ్ సరసన నటించిన సినిమాలో జెనీలియా తెలుగు ఆడియన్స్‌కి పరిచయమైంది.
అభిమానులు ఇప్పటికీ
ఆ తర్వాత రామ్‌తో చేసిన రెడీ సినిమా ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా మారింది. అందులో ఆమె పోషించిన పాత్రకు అభిమానులు ఇప్పటికీ ఫిదా అవుతుంటారు.
ఆమె నటనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు
సత్యం , సై , బొమ్మరిల్లు , ఢీ, రెడీ , కథ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ముఖ్యంగా బొమ్మరిల్లు చిత్రంలో ఆమె నటనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు (ఉత్తమ నటి – తెలుగు) లభించింది. తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాధించుకుంది.
హిందీలో మస్తీ (2004), జానే తు… యా జానే నా (2008), తమిళంలో సంతోష్ సుబ్రమణియం (2008) వంటి చిత్రాల్లో నటించి విజయం సాధించింది.
సామాజిక కార్యక్రమాల్లో
2012లో బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు – రియాన్ (2014), రాహిల్ (2016). సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.