దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన పేరు ఇవానా. ఈ ముద్దుగుమ్మ తన కెరీర్‌ను చిన్న వయస్సులోనే చైల్డ్ ఆర్టిస్ట్ (Child artist) గా ప్రారంభించింది. సినిమాలంటే ఇష్టంతో, తనలోని నటన పట్ల ఆసక్తితో ఆమె సినీ రంగంలోకి అడుగుపెట్టింది. మొదట చిన్న చిన్న పాత్రలు చేసినా, తరువాత హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకుంది.
తమిళ్‌లో మాత్రమే కాకుండా, ఈ సినిమా
ఇవానా అసలు బ్రేక్ అయితే తమిళ్‌లో వచ్చిన లవ్ టుడే (Love today) సినిమా. ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. తమిళ్‌లో మాత్రమే కాకుండా, ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయి రిలీజ్ కాగా, ఇక్కడ కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగు ప్రేక్షకులకు ఇవానా ఒక్కసారిగా పరిచయం అయిపోయింది.
సినిమాకు వచ్చిన స్పందనతో ఇవానా కెరీర్‌కు
లవ్ టుడే తర్వాత ఇవానా సింగిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆమె నటన మళ్లీ చర్చనీయాంశమైంది. సినిమాకు వచ్చిన స్పందనతో ఇవానా కెరీర్‌కు మంచి బూస్ట్ లభించింది. ప్రస్తుతం ఆమెకు దక్షిణాదిలో అనేక ఆఫర్లు వస్తున్నాయి.
హైట్ కారణంగా
ఇవానా గురించి ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా పంచుకున్న విషయాలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. చిన్నతనంలో తన హైట్ కారణంగా తాను చాలా ఇబ్బందులు పడ్డానని ఆమె చెప్పింది. “నాకు హైట్ తక్కువగా ఉండటంతో చాలా అవమానాలు ఎదుర్కొన్నా. స్కూల్‌లో నన్ను స్నేహితులు ‘పొట్టి’ అని పిలిచి ఏడిపించేవారు. రిజక్షన్స్ కూడా చాలానే ఎదుర్కొన్నా. ఆ రోజుల్లో నిజంగా చాలా బాధపడ్డా” అని ఇవానా చెప్పింది.
తెలుగులో ‘హ్యాపీడేస్’ అంటే చాలా ఇష్టమట
వాళ్ల మాటలు చాలా బాధపెట్టేవి దాంతో నేను చదువు పై పెద్దగా దృష్టి పెట్టలేకపోయాను అని తెలిపింది. ఇక చిన్న వయసునుంచే సినిమాల పై ఇంట్రెస్ట్ ఉండేది అని చెప్పుకొచ్చింది. ఇవానాకు తెలుగులో ‘హ్యాపీడేస్’ అంటే చాలా ఇష్టమట. ఈ సినిమా సాంగ్స్ తన ఫెవరెట్ అని తెలిపింది అని చెప్పుకొచ్చింది.. అలాగే ఫేవరెట్ హీరో అల్లు అర్జున్.
ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది
ఇక ఈ చిన్నదనికి ఇప్పుడు వరుసగా అవకాశాలు అందుకుంటుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది తన ఫొటోలతో ఆకట్టుకుంటుందీ అందాల తార.
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.