ఈ భూమ్మీద చంద్రుడు, సూర్యుడు కనిపించని ప్రాంతాలు (Places) ఉన్నాయంటే నమ్మాలనిపించదు. కానీ ఇది నిజమే. ఆ ప్రాంతాలు (Places) ఏవో చూద్దాం.
Finland

ఫిన్లాండ్ కూడా ఈ జాబితాలో ఒకటి. ఇక్కడ వేసవికాలంలో దాదాపు 76 రోజుల పాటు రాత్రి ఉండదు.
Norway

నార్వే ఈ విషయంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన దేశం. దీన్ని చాలా మంది “Land of Midnight Sun” అని పిలుస్తారు. ఇక్కడ మే నుండి జూలై వరకు సూర్యుడు అస్తమించడు.
Canada

కెనడాలోని యుకోన్‌లో ఏడాది పొడవునా మంచు కురుస్తూనే ఉంటుంది. అయితే 50 రోజులు మాత్రం వేసవి కాలం ఉంటుంది. ఈ కాలంలో అర్ధరాత్రి కూడా సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు. అందుకే ఆ 50 రోజుల్లో అనేక పండుగలు, ఉత్సవాలు నిర్వహిస్తారు అక్కడివారు.
Iceland

ఐస్‌లాండ్ లో, జూన్ నెలలో సూర్యుడు అస్తమించడు. ఆ నెల రోజులు పగలు, రాత్రికి అస్సలు తేడా ఉండదు. అందుకే జూన్ నెలలో ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు.
Sweden

స్వీడన్‌లోని కిరున్ నగరంలో ఏడాదిలో దాదాపు వంద రోజుల పాటు సూర్యుడు అస్తమించడు. మే నుంచి ఆగస్టు మధ్యలో సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు.
Alaska

అలాస్కాలోని బారోలో మే నుంచి జూలై వరకు సూర్యుడు అస్తమించడు. అర్ధరాత్రి కూడా సూర్యుడు వెలుగులు విరజిమ్ముతూనే ఉంటాడు. కానీ నవంబర్ నెలలో 30 రోజులు మాత్రం చీకటిగా ఉంటుంది.
Canac, Greenland

గ్రీన్‌లాండ్‌లో, చలికాలంలో పూర్తిగా చీకట్లోనే ఉంటుంది. అదే వేసవికాలంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య మాత్రం సూర్యుడు రోజంతా ప్రకాశిస్తూనే ఉంటాడు.