Phone tapping case.. Notices to Sravan Rao once again

Phone tapping case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. మరోసారి శ్రవణ్ రావుకు నోటీసులు

Phone tapping case : శ్రవణ్ రావుకి ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 8వ తేదీన మళ్లీ తమ ఎదుట హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. శ్రవణ్ రావు పోలీసుల విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు అడిగిన సమాచారాన్ని ఇవ్వకుండా శ్రవణ్ రావు తప్పించుకుంటున్నారు. 2023లో జరిగిన ఎన్నికల సందర్భంగా వాడిన సెల్ ఫోన్లు కావాలని సిట్ కోరింది. రెండు సెల్ ఫోన్లు ఇవ్వాలని అడిగితే ఒకటే ఇచ్చి శ్రవణ్ రావు తప్పించుకున్నారు.

Advertisements
ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి

రెండు సెల్ ఫోన్లు తీసుకొని 8వ తేదీన హాజరు కావాలి

శ్రవణ్ రావు పాత తుప్పు పట్టిన సెల్ ఫోన్ ని పోలీసులకు ఇచ్చారు. శ్రవణ్ రావు ఇచ్చిన సెల్ ఫోన్ చూసి షాక్ కు గురైన పోలీసులు. ఈ నేపథ్యంలో మేము అడిగిన రెండు సెల్ ఫోన్లు తీసుకొని 8వ తేదీన హాజరు కావాలని శ్రవణ్ రావుకి నోటీసులు జారీ చేశారు. మొదటిసారి విచారణలో ఎలాంటి సమాధానాలు చెప్పలేదు. ఇవాళ జరిగిన విచారణలో పాత తుప్పు పట్టిన సెల్‌ఫోన్ ఇచ్చి ఏమీ తెలియదని చెప్పారు. దీంతో తాము అడిగిన సెల్ ఫోన్లు సమాచారం ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కాగా సిట్ కు పూర్తిస్థాయిలో సహకరించాలని శ్రవణ్ రావుని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఆదేశాలను సైతం బేకాతర్ చేస్తున్న శ్రవణ్ రావు

సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేకాతర్ చేస్తున్న శ్రవణ్ రావు. అప్పటి ప్రభుత్వ పెద్దలతో తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రవణ్ రావు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తనకు ప్రభాకర్ రావు తో మాత్రమే సంబంధం ఉందని చెప్తున్నాడు. రాజకీయ నాయకులు అప్పటి ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సాయం చేసిన వాళ్లపై శ్రవణ్ రావు నిగాపెట్టాడు. జడ్జ్ లతోపాటు మీడియా అధిపతులను సైతం శ్రవణ్ రావు వదిలిపెట్టలేదు.

Related Posts
భారత్పై మరోసారి అక్కసు వెల్లగక్కిన కెనడా..
india remaining diplomats clearly on notice canada foreign minister melanie joly

న్యూఢిల్లీ: భారత్‌తో దౌత్య సంబంధాలు తీవ్ర స్థాయిలో దెబ్బతింటున్నా కూడా కెనడా వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్ Read more

Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకరరావు మరొకరికి రెడ్ కార్నర్ నోటీసులు
Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకరరావు మరొకరికి రెడ్ కార్నర్ నోటీసులు

విదేశాల్లో తలదాచుకున్న నిందితులను వెంటనే తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వ చర్యలు ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణలో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన నిందితులైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ Read more

సీఎం రేవంత్ యాదగిరిగుట్టకు మోకాళ్ల యాత్ర చేయాలి – ఏనుగుల రాకేశ్‌ రెడ్డి
revanth paadayatra rakesh

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద బీఆర్‌ఎస్‌ నాయకుడు ఏనుగుల రాకేశ్‌ రెడ్డి చేసిన విమర్శలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన, సీఎం రేవంత్ రెడ్డి Read more

ఆరిలోవ లో నూతన పోలీస్ భవనాన్ని ప్రారంభించిన హోం మంత్రి అనిత
Home Minister Anitha inaugu

ఆరిలోవ హనుమంతువాక వద్ద ఎకరం స్థలంలో 17 గదులతో విశాలముగా నిర్మించిన ఆరిలోవ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ఆదివారం రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు వంగలపూడి Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×