PF withdrawal through UPI.. to be implemented from June!

EPFO : యూపీఐ ద్వారా పీఎఫ్‌ విత్‌డ్రా.. జూన్‌ నుంచి అమలులోకి !

EPFO: ఉద్యోగులు, కార్మికులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) శుభవార్త తెలిపింది. ఏటీఎం, యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) ద్వారా డబ్బును విత్‌డ్రా చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ సందర్భంగా కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి సుమితా దావ్రా మాట్లాడుతూ.. ఈ ఏడాది మే లేదా జూన్‌ నెలాఖరు నుంచి యూపీఐ, ఏటీఎంల ద్వారా ఉద్యోగులు తమ పీఎఫ్‌ సొమ్మును నేరుగా విత్‌డ్రా చేసుకోవచ్చునని తెలిపారు. మన బ్యాంకు ఖాతాలో నుంచి తీసుకున్న మాదిరిగానే పీఎఫ్‌ ఖాతా నుంచి కూడా నేరుగా డబ్బులు ఏటీఎం కేంద్రాలతో పాటు గూగుల్‌ పే, ఫోన్‌పే లాంటి యూపీఐ యాప్‌ల ద్వారా డబ్బు డ్రా చేసుకోవచ్చు.

యూపీఐ ద్వారా పీఎఫ్‌ విత్‌డ్రా

యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ..హైలెట్స్

.యూపీఐ ద్వారా నగదు విత్‌డ్రా – ఇకపై ఉద్యోగులు ఏటీఎం లేదా యూపీఐ ద్వారా తమ పీఎఫ్ నిధులను ఉపసంహరించుకోవచ్చు.
.పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్ సదుపాయం – యూపీఐ యాప్‌ల ద్వారా పీఎఫ్‌లో ఉన్న మొత్తాన్ని కూడా చూడొచ్చు.
.తక్షణ విత్‌డ్రా సదుపాయం – రూ. 1 లక్ష వరకు నేరుగా అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకునే వెసులుబాటు.
.ఆటోమేటెడ్ క్లెయిమ్ ప్రాసెసింగ్ – పీఎఫ్ ఉపసంహరణ క్లెయిమ్‌లు 3 రోజుల్లో పూర్తవుతాయి.
.120 డేటాబేస్‌ల ఏకీకరణ – క్లెయిమ్ ప్రాసెసింగ్‌ను వేగవంతం చేసేందుకు EPFO ఇప్పటికే డిజిటలైజేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేసింది.
.95 శాతం క్లెయిమ్‌లు ఆటోమేటెడ్ – EPFO క్లెయిమ్‌లను స్వయంచాలక (ఆటోమేటెడ్ ప్రాసెస్) విధానంలో నిర్వహిస్తోంది.

ఈపీఎఫ్‌ఓ డిజిటలైజేషన్ ప్రయోజనాలు..

.సులభమైన పీఎఫ్ ఉపసంహరణ – ఇకపై ఉద్యోగులు కనీస డాక్యుమెంటేషన్‌తోనే తమ నిధులను ఉపసంహరించుకోవచ్చు.
.అలర్ట్స్ అండ్ నోటిఫికేషన్స్ – EPFO యాప్ లేదా యూపీఐ యాప్ ద్వారా నేరుగా అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి.
.పూర్తి పారదర్శకత – డిజిటల్ విధానం ద్వారా పీఎఫ్ ట్రాన్సాక్షన్లు సులభంగా ట్రాక్ చేసుకోవచ్చు.
.తక్కువ టైం, తక్కువ శ్రమ – ATM / UPI ద్వారా ఉపసంహరణ మరింత వేగంగా పూర్తవుతుంది.

Related Posts
మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్ని రామకృష్ణారెడ్డి
11 2

అమరావతి: మరోసారి వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన గతంలో విధించిన బెయిల్ షరతులను సడలించాలని, విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టును తిరిగి Read more

వామ్మో.. మేక ఖరీదు అన్ని లక్షలా..? ఏంటో అంత ప్రత్యేకం
Goat Kid Sold In 14 lakh Ru

ఏంటీ ధర చూసి అవాక్కయ్యారా? ఇది మామూలు మేక కాదు మరి. అసాధారణమైన పొడవాటి చెవులు వంటి ప్రత్యేక లక్షణాలకు ఈ మేక ప్రసిద్ధి చెందింది. దీని Read more

Congress : అసెంబ్లీని గౌరవ సభగా కాంగ్రెస్ పార్టీ మార్చింది : శ్రీనివాస్ గౌడ్
Congress party has turned the Assembly into a house of honour.. Srinivas Goud

Congress : అసెంబ్లీని కౌరవ సభలాగా కాంగ్రెస్ పార్టీ మార్చింది అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. స్పీకర్‌ను జగదీష్ రెడ్డి అవమానించలేదు. ఎక్కడా లేని Read more

ఉత్తర గాజాపై దాడి.. 73 మంది మృతి
Attack on northern Gaza. 7

గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. నిన్న రాత్రి ఉత్తర గాజాపై జరిపిన దాడుల్లో 73 మంది మరణించినట్లు హమాస్ సంస్థ పేర్కొంది. వీరిలో చిన్నారులు, మహిళలు ఉన్నట్లు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *