అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక(Sand )ను కృష్ణా నదిలో నుంచి తవ్వేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన డీసిల్టేషన్ (గడ్డ కట్టిన మట్టిని తొలగించే ప్రక్రియ) ద్వారా ఇసుకను తవ్వేందుకు రూ.286 కోట్లు వెచ్చించేలా పాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది అమరావతిలో పెరుగుతున్న నిర్మాణ అవసరాలకు ఓ దిశగా చూడవచ్చు.
టెండర్లు – జలవనరుల శాఖకు బాధ్యత
ఇసుక తవ్వకాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను జలవనరుల శాఖకు అప్పగించింది. అలాగే మొత్తం పనులపై పర్యవేక్షణ బాధ్యతను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA)కి అప్పగించింది. టెండర్ల ద్వారా పారదర్శకంగా పనులు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యలతో రాష్ట్ర రాజధాని అభివృద్ధి పనులకు వేగం చేకూరే అవకాశముంది.
నిబంధనల మేరకే తవ్వకాలు – CRDAకు స్పష్టమైన ఆదేశాలు
ఇసుక తవ్వకాల్లో ఎటువంటి అక్రమాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. అన్ని అనుమతులు, పర్యావరణ నిబంధనలు పాటిస్తూ మాత్రమే తవ్వకాలు జరగాలని CRDAను ఆదేశించింది. భవిష్యత్‌లో పర్యావరణ ప్రభావాలు తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ అనుమతులతో పాటు, నియంత్రణ చర్యలు కూడా సమాంతరంగా తీసుకుంటూ రాజధాని నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది.
Read Also : MPTC : తెలంగాణ లో ఎంపీటీసీ స్థానాలు ఎన్నంటే?