ఆధార్ పై ప్రైవేట్ సంస్థలకు అనుమతి

ఆధార్ పై ప్రైవేట్ సంస్థలకు అనుమతి

ఆధార్ కార్డు ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రం. ఇది ప్రతి భారత పౌరుని ప్రత్యేకంగా గుర్తించే 12 అంకెల ఒక ఐడీ నంబర్ అందిస్తుంది. ఆధార్ కార్డులో పౌరుల పేర్లు చిరునామాలు, వయస్సు, మొబైల్ నంబర్ వేలిముద్రలు వంటి ముఖ్యమైన వ్యక్తిగత వివరాలు ఉంటాయి. ఈ పత్రం భారతీయుల జీవితాల్లో కీలకమైన పాత్ర పోషిస్తుంది.

అయితే, తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు వినియోగం పై ఓ కొత్త మార్పును ప్రకటించింది ఇది ప్రజలలో కొన్ని అభ్యంతరాలను కలిగిస్తోంది.ప్రస్తుతం, భారతదేశంలో ప్రభుత్వం ఆధార్ కార్డును ఒక కీలక గుర్తింపుగా పరిగణిస్తుంది.కానీ,ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ప్రైవేట్ కంపెనీలు కూడా ఆధార్ వివరాలను యాక్సెస్ చేయగలవు. అంటే ప్రైవేట్ సంస్థలు ఆధార్ ఆధారిత సేవలను ఉపయోగించడానికి ఆధార్ వివరాలను ప్రభుత్వానికి అనుమతి తీసుకుని పొందవచ్చు.ఈ నిర్ణయం ప్రకారం, ప్రైవేట్ కంపెనీలు ఆధార్ వివరాలను యాక్సెస్ చేసేటప్పుడు, వారికి కొన్ని కఠినమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ముందుగా వారు కేంద్ర ప్రభుత్వానికి లేదా యూఐడీఏఐకి ఆధార్ వినియోగానికి అనుమతి తీసుకోవాలి.

వారు ఆధార్ వివరాలను అవసరమైన కారణంతో మాత్రమే అడగాలి అదే సమయంలో ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా అవి ఉపయోగించబడతాయి.అయితే ఈ కొత్త ప్రకటనతో పాటు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడే పద్ధతులపై కొన్ని ప్రశ్నలు వచ్చాయి. ఆధార్ లోని వేలిముద్రలు మరియు ఐరిస్ స్కాన్ వంటి సమాచారాన్ని వినియోగించడం వల్ల కొంతమంది మోసాలకు గురైన ఘటనలు కూడా జరిగాయి. మరింతగా ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే ఆధార్ సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి అనుమతించాయి. అయితే ఈ కొత్త నిర్ణయం ప్రకారం ప్రైవేట్ సంస్థలు ఈ సమాచారాన్ని ప్రామాణీకరణ కోసం ఉపయోగించడానికి అనుమతించబడ్డాయి.ఈ నిర్ణయం వల్ల ప్రజలు వారి వ్యక్తిగత సమాచార రక్షణ గురించి ఆందోళన చెందుతున్నారు కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి, దీనికి సుప్రీంకోర్టు ముందుగా వ్యతిరేకించిన విషయం గుర్తుండాలి.

Related Posts
పుష్ప 2′ సీన్‌పై తీన్మార్ మల్లన్న ఫిర్యాదు
img1

'పుష్ప 2' సీన్‌పై తీన్మార్ మల్లన్న ఫిర్యాదు: మరింత చిక్కుల్లో పడ్డా అల్లు అర్జున్ "పుష్ప 2" చిత్రానికి సంబంధించిన ఓ సీన్‌పై ప్రముఖ యూట్యూబర్ మరియు Read more

ఇంటర్నెట్‌ను షేక్ చేసిన ఆరాధ్య బచ్చన్, అబ్రామ్ ఖాన్!
ఇంటర్నెట్‌ను షేక్ చేసిన ఆరాధ్య బచ్చన్, అబ్రామ్ ఖాన్!

ఆరాధ్య బచ్చన్, అబ్రామ్ ఖాన్ వారి ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నారు. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో డిసెంబర్ 19, 2024 సాయంత్రం వార్షిక దినోత్సవ వేడుకలు ఘనంగా Read more

ఢిల్లీ వాయు కాలుష్యంపై యుఎన్ క్లైమేట్ సమిట్‌లో ఆందోళన
baku summit

భారత రాజధాని ఢిల్లీ లో ప్రస్తుతం తీవ్రమైన వాయు కాలుష్యం నెలకొంది. నగరంలో వాయు కాలుష్యం రికార్డు స్థాయిలో పెరిగింది, దీని వల్ల ప్రజల ఆరోగ్యం ముప్పు Read more

మోదీ కంటే కేజీవాలే కన్నింగ్ – రాహుల్ గాంధీ

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ తరహాలోనే కేజ్రీవాల్ Read more