రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసాపై అధికారులు చేపట్టిన గ్రామసభలు రసాభాసగా మారాయి. క్షేత్రస్థాయిలో సర్వే చేయకుండా ప్రభుత్వం ముందే జాబితా ఎలా ప్రకటించిందంటూ ప్రజలు ప్రశ్నించారు. కొన్నిచోట్ల ప్రభుత్వ ఉద్యోగులకు, భూస్వాములకు పథకాలు కేటాయించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చాలా గ్రామాల్లో సభలు అర్ధాంతరంగా ముగిశాయి. ఇదే క్రమంలో కేటీఆర్ సైతం కాంగ్రెస్ సర్కారుపై ప్రజాతిరుగుబాటు మొదలైందంటూ ట్వీట్ చేసారు.
మోసకారి కాంగ్రెస్ సర్కారుపై
ప్రజాతిరుగుబాటు మొదలైంది..
గ్యారెంటీల గారడీపై
జనగర్జన షురూ అయింది
అసమర్థ ముఖ్యమంత్రి
అసలు స్వరూపం బట్టబయలైంది
ఇక కాలయాపనతో కాలం సాగదు
అటెన్షన్ డైవర్షన్ ఏమాత్రం చెల్లదు
ఈ దరఖాస్తుల దందా నడవదు
ఈ ఆగ్రహ జ్వాల ఇక ఆగదు
నమ్మించి చేసిన నయవంచనకు
నాలుగుకోట్ల సమాజం ఊరుకోదు
ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు
అట్టుడికిన గ్రామసభల సాక్షిగా
గ్రామసభలా…ఖాకీల క్యాంప్ లా!?
సంక్షేమ పథకాల కోసమా..కాంగ్రెస్ కార్యకర్తల నిర్ధారణ కోసమా!?
ఖాకీల దౌర్జన్యాలు..
కాంగ్రెస్ నేతల బెదిరింపులతో గ్రామసభలు!
పోలీసు పహారాలో గ్రామలను నింపేసి గ్రామసభలా? ప్రశ్నించిన ప్రజలపై ఖాకీల జులుమే సమాధానమా?
ఇదా.. మీరు చెప్పిన ప్రజా పాలనా?
ఇదా.. మీరు చెప్పిన ఇందిరమ్మ పాలనా?
పోలీసుల నడుమ.. అంక్షల నడుమ..పథకాలకు అర్హుల గుర్తింపట!
నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గేంటి అన్నట్లు కాంగ్రెస్ పాలన!
జై తెలంగాణ అంటూ ట్వీట్ చేసారు.