People Tech signs MoU with

ఏపీలో ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో ప్రైవేట్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పార్కు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టును పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ప్రతిపాదించగా, నిన్న మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.

Advertisements

ఈ ప్రాజెక్టు కోసం సంస్థ రూ.1,800 కోట్ల భారీ పెట్టుబడిని ప్రతిపాదించింది. మొత్తం 1,200 ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కేవలం రాష్ట్రానికి మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ఈవీ పరిశ్రమ అభివృద్ధికి కీలకమవుతుందని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. ఈవీ పార్కు నిర్మాణానికి వచ్చే మార్చి నెలలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా పీపుల్ టెక్ ప్రతినిధులు మాట్లాడుతూ, పార్కు ఏర్పాటుకు సంబంధిత పనులు వేగంగా కొనసాగుతాయని, వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు.

ఈ ప్రాజెక్టు ప్రారంభం తర్వాత, పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ వారి ఫ్యాక్టరీ నుంచి తొలి ఎలక్ట్రిక్ వెహికల్ బైక్ 2026 డిసెంబర్ నాటికి మార్కెట్లోకి వస్తుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఈవీ టెక్నాలజీ అభివృద్ధి దిశగా ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది. ఈవీ పార్కు ఏర్పాటుతో రాష్ట్రానికి అనేక ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలు లభించనున్నాయి. పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, పర్యావరణాన్ని కాపాడే విధంగా శక్తివంతమైన ఈవీ వాహనాలను ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాజెక్టు ఉపయుక్తంగా ఉంటుందని అధికార వర్గాలు విశ్వాసం వ్యక్తం చేశాయి.

Related Posts
అప్పుడు రయ్ రయ్.. ఇప్పుడు నై నై అంటే ఎలా చంద్రబాబు? – వైసీపీ
ఉగాదికి మహిళల ఉచిత బస్సు ప్రయాణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై టీడీపీ , వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా టీడీపీ సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు గతంలో Read more

హీరో కిచ్చా సుదీప్ కు మాతృవియోగం
kiccha sudeep lost his moth

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది, ఆయన తల్లి సరోజా సంజీవ్ కన్నుమూశారు. వయసుతో సంబంధించిన అనారోగ్య సమస్యల కారణంగా కొన్ని Read more

CM Chandrababu : అమరావతిలో ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన చంద్రబాబు
Chandrababu performs Bhoomi Puja for construction of house in Amaravati

CM Chandrababu : రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఇంటి నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెల‌గ‌పూడి Read more

బొర్రా గుహల్లో మహేశ్ బాబు సినిమా షూటింగ్..?
mahesh rajamouli movie

సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే భారీ చిత్రం గురించి ప్ వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలోని Read more

×