శ్రీరామనవమి స్పెషల్‌గా ‘పెద్ది’ గ్లింప్స్ వీడియో రిలీజ్

Peddi Movie: శ్రీరామనవమి స్పెషల్‌గా ‘పెద్ది’ గ్లింప్స్ వీడియో రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది‘. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తుది దశ పనుల్లో ఉంది. ఇప్పటికే టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ అభిమానుల్లో క్రేజ్ నింపగా, తాజాగా శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ ఫ్యాన్స్‌లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

Advertisements

గ్లింప్స్‌లో చెర్రీ మాస్ డైలాగ్ మెరుపులు

గ్లింప్స్‌లో రామ్ చరణ్ కనిపించిన విధానం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఉత్తరాంధ్ర యాసలో ఆయన చెప్పిన డైలాగ్ – “ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసేయ్యాలి పుడాతామా ఏంటి మళ్లీ” అనేది మాస్ ప్రేక్షకులను థియేటర్లలో పూనకం తెప్పించేదిగా మారింది. ఈ ఒక్క డైలాగ్ చాలు చెర్రీ ఈ సినిమాలో ఏ స్థాయిలో రెచ్చిపోయాడో తెలుస్తోంది. డైలాగ్ డెలివరీలోని పవర్, యాసలోని ఒరిజినాలిటీ, రియలిస్టిక్ ప్రెజెంటేషన్ అభిమానులకు గూస్‌బంప్స్ ఇచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇది ఆమె టాలీవుడ్‌లో రెండవ సినిమా. ఇద్దరి జోడీపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. గ్లింప్స్‌లో అయితే ఆమె కనిపించకపోయినా, పోస్టర్స్‌లో ఆకట్టుకున్నారు. సినిమాకు సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ పని చేస్తుండటం అభిమానుల్లో భారీ అంచనాలను రేపింది. బుచ్చిబాబు స్టైల్‌కు, రెహమాన్ క్లాస్ మ్యూజిక్ మిక్స్ అయితే వచ్చే బీజీఎంలు, పాటలు యూనిక్ గానే ఉండబోతున్నాయి. ఇప్పటికే బిజీగా ఉన్న రెహమాన్.. ‘పెద్ది’ కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్నారని సమాచారం. సినిమా విడుదల తేదీ కూడా అధికారికంగా ప్రకటించబడింది. 2026, మార్చి 27న ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇదే తేదీన గతంలో RRR రిలీజై బ్లాక్‌బస్టర్ అయింది. దీంతో మళ్లీ అదే టైమ్‌ఫ్రేమ్‌లో చెర్రీ వస్తుండటంతో బిజినెస్‌ వర్గాల్లో హైప్ మామూలుగా లేదు.

Related Posts
ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు నివాసంపై డ్రోన్‌ దాడి
Drone attack on Israeli Prime Minister Netanyahus residence

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో తీవ్ర ఘర్షణవాతావరణం నెలకొంది. ఈ తరుణంలో ఆందోళనకర ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి సమీపంలో డ్రోన్‌ దాడి జరిగిందని Read more

Sravan rao: ఎట్టకేలకు ఫోన్​ ట్యాపింగ్ కేసులో విచారణకు శ్రవణ్​ రావు హాజరు
ఎట్టకేలకు ఫోన్​ ట్యాపింగ్ కేసులో విచారణకు శ్రవణ్​ రావు హాజరు

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడుగా ఉన్న శ్రవణ్‌రావు శనివారం సిట్‌ ముందు విచారణకు హాజరయ్యారు. మార్చి 29న తెల్లవారుజామున దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న ఆయన, Read more

Job Mela : 3 నెలలకోసారి జాబ్ మేళాలు – సీఎం చంద్రబాబు
కలెక్టర్ సదస్సులో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి Read more

ప్రపంచం వాతావరణ మార్పు వల్ల వచ్చే వినాశానికి సిద్దంగా లేదు
465887 Guterres

ప్రపంచ దేశాలు వాతావరణ మార్పు వల్ల వచ్చే వినాశానికి ఇంకా సిద్దంగా లేవని ఈ సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని యూనైటెడ్ నేషన్స్ (UN) ప్రధాన కార్యదర్శి Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×