తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గురువారం ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (PECET) మరియు ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (EdCET) షెడ్యూల్‌ను ప్రకటించింది.
పీఈసెట్ వివరాలు
- నోటిఫికేషన్ విడుదల: మార్చి 12
- దరఖాస్తుల స్వీకరణ: మార్చి 15 – మే 24
- ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువు: మే 30
- పరీక్ష తేదీలు: జూన్ 11 – జూన్ 14
అర్హత వివరాల్లోకి వెళ్తే అభ్యర్థులు తప్పనిసరిగా తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారై ఉండాలి. B.P.Ed (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్) కోర్సులో చేరేందుకు కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. D.P.Ed (డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్) కోర్సుకు కనీసం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, అభ్యర్థులు శారీరకంగా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటం అవసరం. PECET పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు తెలంగాణలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల్లో B.P.Ed మరియు D.P.Ed కోర్సుల్లో చేరేందుకు అర్హత పొందుతారు.
ఎడ్‌సెట్ వివరాలు
- నోటిఫికేషన్ విడుదల: మార్చి 10
- దరఖాస్తుల స్వీకరణ: మార్చి 12 – మే 13
- పరీక్ష తేదీ: జూన్ 1 (ఉదయం & మధ్యాహ్నం రెండు సెషన్‌లు)
అర్హత వివరాల్లోకి వెళ్తే అభ్యర్థులు తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి. కనీసం 50% మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ (BA, B.Sc, B.Com, B.Tech, BBA) పూర్తి చేసివుండాలి. EdCETలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తెలంగాణలోని B.Ed కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. PECET, EdCET పరీక్షలకు అర్హత ఉన్న అభ్యర్థులు నిర్దేశిత తేదీలలో దరఖాస్తు చేసుకోవాలి. ఆలస్య రుసుముతో అప్లై చేయకుండా గడువు ముగిసేలోపు దరఖాస్తు పూర్తి చేసుకోవడం ఉత్తమం.