Pawan Varahi public meeting in Tirupati today

నేడు తిరుపతిలో పవన్ వారాహి బహిరంగ సభ

Pawan Varahi public meeting in Tirupati today
Pawan Varahi public meeting in Tirupati today

అమరావతి: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ రోజు తిరుపతిలో వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరుపతి జ్యోతిరావ్ పూలే సర్కిల్ నిర్వహించే వారాహి బహిరంగ సభ నిర్వహణకు జనసేన, కూటమి నేతలు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం నిర్వహించే సభలో పవన్ కల్యాణ్ వారాహి డిక్లరేషన్ ను ప్రజలకు వివరించనున్నారు. పవన్ కల్యాణ్ డిప్యూటి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది ఆయన తొలి బహిరంగ సభ కావడం, వారాహి డిక్లరేషన్ ప్రకటించనుండటం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Advertisements

పవన్ ప్రకటించే డిక్లరేషన్ లో ఎలాంటి అంశాలు ఉన్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వారాహి డిక్లరేషన్ ద్వారా పవన్ కల్యాణ్ ఏమి సందేశం ఇస్తారు అనేది దానిపై అందరిలోనూ ఆసక్తిరేపుతోంది. తిరుపతి క్షేత్రంగా జరుగుతున్న ఈ వారాహి బహిరంగ సభకు రాయలసీమ జిల్లాల నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు హజరవుతారని భావిస్తున్నారు. కాగా, పవన్ కల్యాణ్ మూడు రోజులుగా తిరుపతిలోనే ఉన్నారు. తిరుపతి లడ్డూ అంశంపై 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేసిన పవన్ కల్యాణ్ .. నిన్న శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమించారు.

Related Posts
KA Paul: పవన్ కళ్యాణ్ పై కేఏ పాల్ ఘాటు వ్యాఖ్యలు
కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు – పవన్ కళ్యాణ్‌పై మతపరమైన విమర్శలు!

ప్రముఖ క్రైస్తవ ప్రబోధకుడు కేఏ పాల్ మరోసారి జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన పవన్ కళ్యాణ్ రాజకీయంగా Read more

Lotteries in AP : ఆంధ్రాలో లాటరీలు, ఆన్‌లైన్ గేమింగ్‌ అనుమతించే ఆలోచన!
'తల్లికి వందనం' కు మార్గదర్శకులు

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి దాదాపు ఏడాది పూర్తవుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పన్నులు, జీఎస్టీ ఆదాయం క్రమంగా Read more

చిత్తూరు కాల్పుల్లో బిగ్ ట్విస్ట్
చిత్తూరు కాల్పుల్లో బిగ్ ట్విస్ట్

చిత్తూరులో ఉదయం ఉద్రిక్తత: పుష్ప కిడ్స్ షాప్ పై దుండగుల దాడి చిత్తూరు జిల్లా గాంధీ రోడ్ లోని పుష్ప కిడ్స్ వరల్డ్ షాప్ పై సాయంత్రం Read more

బద్వేల్ ఘటన-నిందితుడికి 14 రోజుల రిమాండ్
Shocked by girls death in

బద్వేల్ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇంటర్ విద్యార్థిని పై విఘ్నేశ్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి అంటించగా..బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ Read more

×