పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ‘ఓజీ’ (‘Ozzy’) చిత్ర షూటింగ్ పూర్తయిందని చిత్ర నిర్మాణ సంస్థ DVV ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదలైన పవన్ లేటెస్ట్ పోస్టర్ (Pawan latest poster) అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ మరింత పెంచింది.”సినిమా షూటింగ్ పూర్తయింది, ఇప్పుడు థియేటర్ల వంతు. ఓజీ ఆశ్చర్యపరుస్తుంది” అంటూ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా మాస్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ ట్వీట్‌తో అభిమానుల్లో భారీగా హైప్ క్రియేట్ అయ్యింది.

గ్యాంగ్‌స్టర్ రోల్‌లో పవన్ – ముంబై నేపథ్య కథ
దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. పవన్ కల్యాణ్ ఇందులో ఇంటెన్స్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. పోస్టర్‌లో ఆయన లుక్ మాస్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చింది.ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా తెలుగు తెరపైకి అడుగుపెడుతున్నారు. ఇది సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
బలమైన సపోర్టింగ్ కాస్ట్
ప్రఖ్యాత నటులు ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం తమన్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీకి రవి కె చంద్రన్, ఎడిటింగ్‌కి నవీన్ నూలి బాధ్యతలు చేపట్టారు.‘ఓజీ’ చిత్రాన్ని సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. రాజకీయంగా బిజీగా ఉన్న పవన్, సినిమా పట్ల కూడా అదే డెడికేషన్‌తో ముందుకు వెళ్తున్నాడు. ఫ్యాన్స్‌కు ఇది గ్యారంటీ పండుగే.
Read Also : Murder : మెదక్ జిల్లాలో అన్నపై తమ్ముడి ఘాతుకం