ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) శుక్రవారం పటాన్‌చెరులో ఆకస్మికంగా ప్రత్యక్షమయ్యారు. సంగారెడ్డి జిల్లాలోని అంతర్జాతీయ ఖ్యాతిగల ఇక్రిశాట్ క్యాంపస్‌లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ (ISH) పాఠశాలను ఆయన సందర్శించడం ఆశ్చర్యం కలిగించింది.ఈ పాఠశాల సందర్శన వెనుక ఉన్న కారణంపై ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్ కళ్యాణ్ (Mark Shankar Kalyan) అడ్మిషన్ కోసమే అక్కడికి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. స్కూల్‌లో అడ్మిషన్‌కు అవసరమైన వివరాలు తెలుసుకున్నారట.
స్కూల్ సౌకర్యాలను పరిశీలించిన పవన్
ఐఎస్‌హెచ్ పాఠశాలలోని విద్యా విధానం, భద్రతా ఏర్పాట్లు, విద్యార్థుల సంక్షేమంపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. క్లాస్‌రూమ్‌లు, వసతి గదులు, ప్రయోగశాలలు వంటి ముఖ్యమైన విభాగాలను ఆయన పరిశీలించినట్టు సమాచారం.ఇటీవల పవన్ కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న సింగపూర్ పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఘటన తర్వాతే ఆయన హైదరాబాద్ పరిసరాల్లో ప్రత్యామ్నాయ విద్యాసంస్థలపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. అందులో భాగంగా ఐఎస్‌హెచ్ స్కూల్‌ను పరిశీలించడం జరిగిందని భావిస్తున్నారు.
తన కుమారుని భవిష్యత్తుపై పవన్ శ్రద్ధ
పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా, తన కుమారుని చదువుపై పూర్తి శ్రద్ధ చూపుతున్నారు. గుణాత్మక విద్య కోసం మంచి అవకాశాలను వెతుకుతూ ఉన్నారు. ఐఎస్‌హెచ్ లాంటి ప్రఖ్యాత స్కూల్‌లో అడ్మిషన్ తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఆయన పర్యటన జరిగిందని పలువురు చెబుతున్నారు.
Read Also : Helicopter : ఎమర్జెన్సీగా ల్యాండ్ అయిన వాయుసేన అపాచీ హెలికాప్టర్