Pawan Kalyan visit to Cochin tomorrow.

రేపు కొచ్చిన్‌లో పవన్ కళ్యాణ్ పర్యటన..!

రేపటి నుంచీ దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన

అమరావతి: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైందవ ధర్మ పరిరక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. అందులో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను ఆయన దర్శించుకోనున్నారు. రేపు (ఫిబ్రవరి 12) ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ కు బయలుదేరి వెళ్లనున్నారు. రేపటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆయన జ్వరం నుంచి కోలుకుంటుండగానే ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయింది.

Advertisements
image

ఇందులో, అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామ స్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాలను సందర్శించనున్నారు. సనాతనధర్మ పరిరక్షణలో భాగంగానే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే సనాతన బోర్డు ఏర్పాటుకు సంకల్పించారు. మూడు రోజుల పాటు దక్షిణాదిలోని పలు ఆలయాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. దీంతో పాటు గతంలో మొక్కుకున్న మొక్కులు తీర్చుకోవడానికి కూడా వెళుతున్నారు. అయితే ఇప్పటికే సనాతన ధర్మ‌ బోర్డు ఏర్పాటుకు డిప్యుటీ సీఎం పవన్ సంకల్పించిన విషయం తెలిసిందే.

Related Posts
వివేకా కేసులో సాక్షుల మరణాల పై దర్యాఫ్తు
వివేకా కేసులో సాక్షుల మరణాల పై దర్యాఫ్తు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు: సాక్షుల మరణాలు, అనుమానాలు మరియు సమగ్ర దర్యాఫ్తు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తుతం కీలక దశలో ఉంది. Read more

అంబటి వ్యాఖ్యలకు పెమ్మసాని కౌంటర్
pemmasani chandrasekhar amb

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ మాటల యుద్ధం మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కౌంటర్ ఇచ్చారు. Read more

మందుబాబులకు చంద్రబాబు షాక్
liquor sales in telangana jpg

ఏపీలో మందుబాబులకు సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. మద్యం పై 2 శాతం సెస్ విధిస్తూ జీవో జారీ చేసారు.డ్రగ్ రిహాబిలిటేషన్ సెస్ కింద దీన్ని వసూలు Read more

తెలంగాణ మహిళా కమిషన్‌కు వేణుస్వామి క్షమాపణలు
Venuswamy apologizes to Telangana Women Commission

హైదరాబాద్‌: జ్యోతిష్యుడు వేణుస్వామి తెలంగాణ మహిళా కమిషన్‌కు క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. నటీనటుల వ్యక్తిగత జీవితాలపై గతంలో వేణుస్వామి వ్యాఖ్యలు చేశారు. Read more

×