pawan kalyan to participate in palle panduga in kankipadu

నేడు ఏపిలో ‘పల్లె పండుగ’ కార్యక్రమాని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం

అమరావతి: గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలను మార్చాలనేది ప్రభుత్వ లక్ష్యం. పల్లె పండుగ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా కంకిపాడు నుంచి ప్రభుత్వం ప్రారంభించబోతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా కంకిపాడులో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా కంకిపాడులో రూ. 91 లక్షలతో నిర్మించే 11 సిమెంట్ రోడ్లు, రూ. 4.15 లక్షలతో నిర్మించే రెండు గోకులాలు, పునాదిపాడులో రూ. 54 లక్షలతో నిర్మించే రెండు రోడ్ల నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేయనున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పాటు, 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు. కంకిపాడులోని టీడీపీ కార్యాలయం ఆవరణలో సభను నిర్వహించనున్నారు. ఇంకోవైపు, కంకిపాడులో జరిగే కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తదితరులు పాల్గొననున్నారు.

Related Posts
దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్‌
The center is good news for the people of the country

ఉద్యోగుల్లా ప్రతి నెల పింఛన్ వచ్చే పథకానికి రూపకల్పన న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్లకు వచ్చినట్టుగానే 60 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి Read more

జమిలి ఎన్నికలతో చాలా ప్రమాదం – బీవీ రాఘవులు
CPI BV Raghavulu Key Commen

జమిలి ఎన్నికలతో దేశానికి చాలా ప్రమాదమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికలను దేశంలోని అన్ని పార్టీలను వ్యతిరేకిస్తున్నాయని Read more

వైఎస్ షర్మిలతో, విజయసాయిరెడ్డి భేటీ?
వైఎస్ షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ

రాజకీయాల్లోకి దూరంగా వెళ్ళిపోతున్నట్లు ప్రకటించి సంచలనం రేపిన విజయసాయిరెడ్డి, ఇప్పుడు మరొక కొత్త సంచలనం సృష్టించారు. మూడు రోజుల క్రితం, ఆయన హైదరాబాద్‌లోని వైఎస్ షర్మిల నివాసానికి Read more

YCP Iftar Dinner : ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగన్
Jagan IFTAR

రంజాన్ పవిత్రమైన నెల సందర్భంగా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో ప్రత్యేక ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందు విజయవాడ గురునానక్ కాలనీలోని Read more