Pawan Kalyan responded to Adanis issue

అదానీ అంశంపై స్పందించిన పవన్‌ కళ్యాణ్‌

అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అదానీ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖా మంత్రి భూపేంద్ర యాదవ్ తో పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… గత ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని… అదానీ సోలార్ ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారని తెలిపారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హింస చాలా బాధాకరం. తీవ్ర ఆవేదన చెందుతున్నామని… బంగ్లాదేశ్ ఏర్పడిందే భారత సైన్యం త్యాగాలతో అన్నారు. భారత్ లో మైనార్టీలను ఎలా చూస్తున్నాం, అక్కడ మైనార్టీ హిందువులను ఎలా చూస్తున్నారు? అని ఆగ్రహించారు.

పాలస్తీనా లో ఏదైనా జరిగితే స్పందించే ప్రముఖులు, బంగ్లాదేశ్ లో జరిగే అంశాలపై ఎందుకు స్పందించరు అంటూ ప్రశ్నించారు. ₹110 కోట్ల ఎర్ర చందనం దుంగలను కర్ణాటకలో దొరికితే, వాటిని ఆ రాష్ట్రం అమ్మేసిందని… అదే ఎర్ర చందనం ఇతర దేశాల్లో దొరికితే తిరిగి తెప్పించుకోవచ్చు అన్నారు. నేపాల్ నుంచి కూడా అలాగే రప్పించామని…విదేశాల విషయంలో ట్రీటీ ఉన్నట్టు పొరుగు రాష్ట్రాల్లో దొరికినప్పుడు ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడికి చేరవేసే విధానం లేదని వివరించారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి తో మాట్లాడాను. సొంత రాష్ట్రానికి అప్పగించేలా చర్యలు చేపట్టాలని కోరానని వివరించారు. అదానీ పవర్ విషయంలో లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి… ఈ విషయంలో అంతర్జాతీయ స్థాయిలో ఏం జరిగింది అన్నది తెలుసుకోవాల్సి ఉందన్నారు.

Related Posts
Dinner : రాత్రి భోజనం తర్వాత ఇలా చేయండి!
Dinner2

భోజనం అనంతరం కొంత సమయం నడవడం ఆరోగ్యానికి ఎంతో మేలుకలిగిస్తుంది. వైద్యుల సూచనల ప్రకారం, రాత్రి భోజనం తర్వాత కనీసం 10 నిమిషాలు నడవడం జీర్ణక్రియను వేగవంతం Read more

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ముబారక్‌ గుల్‌ ప్రమాణస్వీకారం
Mubarak Gul sworn in as Protem Speaker of Jammu and Kashmir Assembly

శ్రీనగర్‌: కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో సుదీర్ఘకాలం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అక్కడ చివరగా బీజేపీ-పీడీపీ సంకీర్ణ సర్కారు కుప్పకూలడం, జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ Read more

తెలంగాణలో 60 వేల కోట్ల పెట్టుబడితో AWS డేటా సెంటర్లు
తెలంగాణలో 60 వేల కోట్ల పెట్టుబడితో AWS డేటా సెంటర్లు

దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025లో, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) గ్లోబల్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పంకే, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ Read more

మిస్ వరల్డ్ – భారత్ తరఫున పోటీలో ఈమెనే
nandini gupta

ప్రపంచ ప్రఖ్యాత అందాల పోటీ మిస్ వరల్డ్ ఈసారి భారతదేశంలోనే జరుగనుంది. 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ట్రంలో మే 7 నుండి 31 వరకు Read more