Pawan Kalyan responded to Adanis issue

అదానీ అంశంపై స్పందించిన పవన్‌ కళ్యాణ్‌

అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అదానీ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖా మంత్రి భూపేంద్ర యాదవ్ తో పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… గత ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని… అదానీ సోలార్ ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారని తెలిపారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హింస చాలా బాధాకరం. తీవ్ర ఆవేదన చెందుతున్నామని… బంగ్లాదేశ్ ఏర్పడిందే భారత సైన్యం త్యాగాలతో అన్నారు. భారత్ లో మైనార్టీలను ఎలా చూస్తున్నాం, అక్కడ మైనార్టీ హిందువులను ఎలా చూస్తున్నారు? అని ఆగ్రహించారు.

Advertisements

పాలస్తీనా లో ఏదైనా జరిగితే స్పందించే ప్రముఖులు, బంగ్లాదేశ్ లో జరిగే అంశాలపై ఎందుకు స్పందించరు అంటూ ప్రశ్నించారు. ₹110 కోట్ల ఎర్ర చందనం దుంగలను కర్ణాటకలో దొరికితే, వాటిని ఆ రాష్ట్రం అమ్మేసిందని… అదే ఎర్ర చందనం ఇతర దేశాల్లో దొరికితే తిరిగి తెప్పించుకోవచ్చు అన్నారు. నేపాల్ నుంచి కూడా అలాగే రప్పించామని…విదేశాల విషయంలో ట్రీటీ ఉన్నట్టు పొరుగు రాష్ట్రాల్లో దొరికినప్పుడు ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడికి చేరవేసే విధానం లేదని వివరించారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి తో మాట్లాడాను. సొంత రాష్ట్రానికి అప్పగించేలా చర్యలు చేపట్టాలని కోరానని వివరించారు. అదానీ పవర్ విషయంలో లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి… ఈ విషయంలో అంతర్జాతీయ స్థాయిలో ఏం జరిగింది అన్నది తెలుసుకోవాల్సి ఉందన్నారు.

Related Posts
అస్వస్థతకు గురైన ధంకర్ ఆస్పత్రికి తరలింపు
అస్వస్థతకు గురైన ధంకర్ ఆస్పత్రికి తరలింపు

అస్వస్థతకు గురైన ధంకర్ ఆస్పత్రికి తరలింపు తాజాగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ అనారోగ్యానికి గురయ్యారు. ఛాతీలో నొప్పి, అసౌకర్యం కారణంగా ఆయనను అర్ధరాత్రి అత్యవసరంగా ఢిల్లీ Read more

ఉక్రెయిన్‌కు ATACMS క్షిపణులు: రష్యా యుద్ధంలో అమెరికా జోక్యం పెరుగుతుంది
atacmc

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న పరిస్థితుల్లో, అమెరికా ఉక్రెయిన్‌కు దీర్ఘ పరిధి క్షిపణులను (ATACMS) ఉపయోగించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ క్షిపణులు రష్యా భూభాగంలో లోతుగా ఉన్న లక్ష్యాలను Read more

అసలునిజం బయట పెట్టిన U.శ్రీనివాసరావు దీనికంతటికి కారణం ఒక అమ్మాయి – రాజమౌళి & యు.శ్రీనివాసరావు
SS రాజమౌళి వివాదం – అసలు ఏమి జరిగింది?

యు.శ్రీనివాసరావు రాసిన డెత్ లెటర్ వివరణ యు.శ్రీనివాసరావు. అనే నేను నాకు రాజమౌళికి 36 ఏళ్లుగా స్నేహం ఉంది , అందరి జీవతల్లాగా మా జీవితం లో Read more

ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు తీపి కబురు
andhra pradesh

ఏపీ ప్రభుత్వం పదో తరగతిలో వంద శాతం ఫలితాల సాధించే దిశగా.. వంద రోజుల ప్రణాళికను తీసుకొచ్చింది. ఈ ప్రణాళికలో భాగంగా రెండో శనివారం, ఆదివారాల్లో పదో Read more

×