ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా ప్రచారం చేసిన ఘటన కలకలం రేపింది. పవన్‌ను కించపరిచేలా మార్ఫింగ్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనసేన శ్రేణుల్లో ఆగ్రహావేశాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో జనసేన నాయకులు పిఠాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మార్ఫింగ్ చేసిన ఫొటోలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం – విశాఖపట్నంలో జరిగిన ప్రపంచ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పవన్ పాల్గొన్న ఫొటోలను మార్ఫింగ్ చేసి, అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారని ఆయన వివరించారు.
ప్రచారంపై కేసు నమోదు, ముగ్గురు అరెస్ట్
దర్యాప్తులో మూడు ప్రాంతాలకు చెందిన ముగ్గురు నిందితులు అరెస్ట్ అయ్యారు. వారు అరెస్టయిన వారిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్.యానానికి చెందిన కర్రి వెంకట సాయి వర్మ, మచిలీపట్నం మండలం వలందపాలెం గ్రామానికి చెందిన పాముల రామాంజనేయులు, హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ సింగరేణి కాలనీకి చెందిన షేక్ మహబూబ్ ఉన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Read also: AP Mega DSC 2025 Answer Key: మెగా డీఎస్సీ అభ్యర్ధులకు ఆన్సర్ ‘కీ’లు విడుదల