ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లోని తన పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయనకు చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. ప్రస్తుతం ఆయన సింగపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు .

ప్రమాద వివరాలు
సింగపూర్‌లోని మార్క్ శంకర్ చదువుకుంటున్న పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయనకు పైవిధంగా గాయాలు అయ్యాయి. స్కూల్ సిబ్బంది వెంటనే స్పందించి, ఆయనను ఆసుపత్రికి తరలించారు .
పవన్ కళ్యాణ్ ప్రతిస్పందన
ప్రమాద సమయంలో పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటనలో ఉన్నారు. ఈ సమాచారం అందిన వెంటనే, ఆయన పర్యటనను ముగించుకుని సింగపూర్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, అరకు సమీపంలోని కురిడి గ్రామాన్ని సందర్శించేందుకు ముందస్తుగా భరోసా ఇచ్చినందున, ఆ గ్రామాన్ని సందర్శించిన తర్వాతే సింగపూర్‌కు వెళ్లాలని నిర్ణయించారు . మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కల్యాణ్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్క్ శంకర్ పవనోవిచ్ ప్రస్తుతం తల్లి అన్నా లేజ్‌నేవాతో కలిసి సింగపూర్‌లో ఉన్నారు. తల్లి అన్నా లేజ్‌నేవా 2024లో సింగపూర్‌లోని ప్రముఖ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుండి మాస్టర్స్ డిగ్రీ (MA) పూర్తిచేశారు. దీంతో శంకర్ పవనోవిచ్ కూడా తల్లితో పాటు అక్కడే ఉంటున్నారు. సింగపూర్‌లోనే తన విద్యను కొనసాగిస్తున్నారు . పవన్ భార్య ఎప్పటికప్పుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్దితిపై పవన్ కు వివరాలు అందిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ తన పర్యటనను ముగించుకుని, కుమారుడిని చూడడానికి సింగపూర్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
Read also: Bennylingam: పాస్టర్ ప్రవీణ్ మృతిపై పూటకో మాట మాట్లాడుతున్నబెన్నిలింగం