Pawan Kalyan : ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్ రేపు తెలుగు సంవత్సరాది ఉగాది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.మన ముంగిళ్లకు వచ్చిన ఉగాది, తెలుగువారి వారసత్వపు పండుగ అంటూ ఆయన ఈ సందర్భంగా అభివర్ణించారు.పండుగలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, కళలు—ఇవన్నీ జాతిని సజీవంగా నిలిపే మూలస్తంభాలు అని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఈసారి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం కావడంతో, కొత్త సంవత్సరం ప్రజల జీవితాల్లో సిరిసంపదలు నింపాలని ఆకాంక్షించారు.జీవితం కష్టసుఖాల సమ్మేళనం.మన ఉగాది పచ్చడిని అందుకు నిదర్శనంగా భావిస్తాం” అని పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వ పాలన ప్రజలకు కష్టమయం కాగా, ఇప్పుడా బాధలకు ముగింపు పలికి, ప్రజల ముంగిట మంచి పాలన నిలబడింది అని తెలిపారు.చైత్రమాసపు శోభతో వసంతాన్ని తీసుకొచ్చిన శ్రీ విశ్వావసు నామ ఉగాది తెలుగు ఇంటింటిని సిరిసంపదలతో నింపాలి అంటూ పవన్ కళ్యాణ్ కోరుకున్నారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి కుటుంబానికి శాంతి, సమృద్ధి, ఆరోగ్యం కలిగించాలని ఆకాంక్షించారు.