ప్రస్తుతం ఏపీ ఉపముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రముఖ నటుడు, హాస్యనటుడు కృష్ణ భగవాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో ఆయన పవన్ రాజకీయ జీవితానికి, వ్యక్తిత్వానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

పవన్ కల్యాణ్‌పై కృష్ణభగవాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
కృష్ణ భగవాన్ మాట్లాడుతూ – హాయిగా ఉండే సినిమా ఫీల్డ్‌ను వదిలి, ఎండలో తిరుగుతూ, మాటలు పడి, ప్రజల కోసం శ్రమిస్తూ, నమ్మిన పార్టీని పట్టుకుని నిలబడటం మాములు విషయమేమీ కాదు అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌కి ఉన్న కమిట్‌మెంట్‌ను ఆయన ప్రశంసిస్తూ, కష్ట ఫలితం అందుకే కృషి చేస్తే మనుషులు ఉపముఖ్యమంత్రులు అవుతారు అని చమత్కరించారు. ఇది పవన్ రాజకీయ సఫలతను చాటే వ్యాఖ్యలు. సినిమా రంగంలో ఓ స్టార్ హీరో స్థాయిలో ఉండే వ్యక్తి సామాన్య ప్రజల సమస్యల కోసం బహిరంగ సభల్లో, రోడ్ షోలలో పాల్గొంటూ, తమ సమస్యలను ప్రభుత్వానికి వెళ్లి వినిపించాలనే లక్ష్యంతో రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడం నిజంగా స్ఫూర్తిదాయకమనే చెప్పాలి.
కృష్ణ భగవాన్ పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన మరొక మధుర స్మరణను పంచుకుంటూ – సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో ఆయనతో చాలా సమయం గడిపాను. అప్పుడు ఆయనతో చక్కగా మాట్లాడారు. ‘మీరు మంచి రైటర్ కదా’ అని చెప్పడం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది అన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో నుంచి వ్యక్తిగత గుర్తింపు పొందటం అనేది ఎంతో గర్వకారణంగా భావించినట్లు చెప్పారు. సెట్లో ఆయన చాలా సాధారణంగా, ఓ మానవుడిలా ప్రవర్తిస్తారు. హీరో గర్వం, స్టార్డమ్ లాంటి ఫీలింగ్ అతనికి లేదు అని అన్నారు. హీరో, డిప్యూటీ సీఎం అనే భావన లేకుండా ఒక మంచి మనిషిలా ఆయన ప్రవర్తన ఉంటుందని చెప్పుకొచ్చారు. కృష్ణభగవాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై పవన్ అభిమానులు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
Read also: Rambha: కుటుంబ బాధ్యతలతోనే సినిమాలకి దూరమయ్యా: రంభ