Pawan Kalyan is going to campaign for Maharashtra elections today

నేడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్న పవన్ కళ్యాణ్

అమరావతి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు(శనివారం) మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు కూటమి అభ్యర్థులకు మద్దతుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తారు. జనసేనాని పవన్ కళ్యాణ్ నేటి నుంచి రెండురోజుల పాటు మహారాష్ట్రలో రెండు రోడ్ షోలు, ఐదు బహిరంగ సభల్లో పాల్గొంటారు. అయితే మొదటి రోజు పర్యటనలో భాగంగా ఇవాళ(శనివారం) మరట్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

అనంతరం అదే జిల్లాలోని భోకర్ నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2 గం.కు లాతూర్ చేరుకుంటారు. అక్కడ నిర్వహించే సభలో పాల్గొంటారు. రాత్రి 6గం.కు షోలాపూర్ నగరంలో రోడ్ షోలో పాల్గొంటారు. రేపు(17వ తేదీ) విదర్భ ప్రాంతానికి వెళ్తారు. ఆదివారం ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం పుణె కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో రోడ్ షో లో పాల్గొంటారు. అనంతరం కస్బా పేట్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఇదిలా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు కూడా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.

Related Posts
ఎవరినీ వదిలిపెట్టాను అంటూ జగన్ వార్నింగ్
jagan fire cbn

తమ పార్టీ నాయకులపై అన్యాయంగా కేసులు అన్యాయంగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టేది లేదు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం Read more

ముగిసిన కుంభ మేళా.. 66 కోట్ల మందికి పైగా పుణ్య స్నానాలు..
Kumbh Mela is over.. More than 66 crore people took holy bath

చివరి రోజూ ప్రయాగ్‌రాజ్‌కు భక్తుల వరద ప్రయాగ్‌రాజ్‌: ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభ మేళా శివరాత్రి పర్వదినమైన బుధవారం వైభవంగా ముగిసింది. ప్రజల భక్తి, ఐక్యత, సామరస్యాల సంగమంగా Read more

Lavu Sri Krishna Devarayalu: లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు చేయాలని టీడీపీ ఎంపీ డిమాండ్
Lavu Sri Krishna Devarayalu: లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు చేయాలని టీడీపీ ఎంపీ డిమాండ్

ఏపీ వైకాపా హయాంలో భారీ అవకతవకలు! ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా పాలనలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను మించిపోయిందని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత లావు Read more

చంద్రబాబుకి భయపడను: జగన్
భయపడను చంద్రబాబుకి జగన్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి కొత్త చర్చకు కారణమయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేసారు. అదే సమయంలో ఎమ్మెల్సీ Read more