pawan water

త్రాగునీటి సమస్యను పరిష్కరించిన పవన్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోల్లప్రోలు బాలుర ప్రాథమికోన్నత పాఠశాలలో నాలుగు సంవత్సరాలుగా ఉన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించారు. ఆయన సూచనల మేరకు CSR నిధుల ద్వారా రూ. 4 లక్షలతో ఆర్‌ఒ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది.

గత నాలుగు సంవత్సరాలుగా రక్షిత త్రాగునీరు సదుపాయం లేక విద్యార్థులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమీపంలోని శ్రీ వేంకటేశ్వర రైస్ మిల్ వద్ద మంచినీరు వస్తున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. రైస్ మిల్ యాజమాన్యంతో మాట్లాడి వారిని ఒప్పించారు. 4 లక్షల CSR ( Corporate Social Responsibility) నిధులతో ఆర్వో ప్లాంట్ కు రైస్ మిల్ నుండి మంచినీటి సరఫరా ఏర్పాటు చేయడం కోసం డెడికేటెడ్ పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు స్వచ్ఛమైన రక్షిత త్రాగునీరు అందించేలా వెంటనే చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగం, శ్రీ వేంకటేశ్వర రైస్ మిల్ యాజమాన్యానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Related Posts
ఎలన్ మస్క్ స్టార్‌షిప్ రాకెట్: భవిష్యత్తులో వేగవంతమైన ప్రయాణం
musk 1

ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచిన ఎలన్ మస్క్, భవిష్యత్తులో రాకెట్ ఆధారిత అతి వేగవంతమైన ప్రయాణాన్ని ఎలా అందించాలనే విషయం పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు Read more

Trump : ట్రంప్ మరో కీలక నిర్ణయం.. భారత్ కు షాక్?
విద్యాశాఖను రద్దు చేస్తూ ట్రంప్ ఉత్తర్వులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన ప్రకటన ప్రకారం, వెనెజువెలా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలు ఇకపై అమెరికాతో చేసే Read more

జగన్ పై ఏపీ పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం
jagan fire cbn

జగన్ తన మాటలను వెనక్కి తీసుకోవడం మంచింది పోలీసుల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇటీవల Read more

రెపోరేటు తగ్గింపుతో మీ EMI ఎంత తగ్గుతుందో తెలుసా..?
Home loan repo down

బ్యాంకింగ్ రంగంలో కీలకమైన పరిణామంగా రిపో రేట్ తగ్గింపు వల్ల రుణ గ్రహీతలకు అనేక ప్రయోజనాలు అందనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా నిర్ణయంలో Read more