YS Jagan: హిందూ ధర్మం, ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు లేదని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. కశీనాయన క్షేత్రాన్ని కూల్చేస్తుంటే పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఎక్స్‌లో మండిపడ్డారు. ఆలయాల పట్ల తమకు ఉన్న చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాశీనాయన ఆలయాన్ని కూటమి ప్రభుత్వం కూలుస్తోంది. ఆ ఆలయ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో
దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా?” కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ”అటవీ ప్రాంతంలో ఉన్న కాశీనాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై ఆగస్టు7, 2023న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుంబిగించిన మాట వాస్తవం కాదా?
మా పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఒక్క చర్య తీసుకోలేదు
అదే నెల ఆగస్టు 18, 2023న అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కి ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖరాసి కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీశాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రానికి రిజర్వ్ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తు.చ.తప్పక పాటిస్తామని లేఖలో చాలా స్పష్టంగా చెప్పాం. మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. మా ఐదేళ్ల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్యకూడా తీసుకోలేదు.