हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫిలింలకు గ్రీన్ సిగ్నల్ – నిర్మాతలకు ఊరట

Divya Vani M
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫిలింలకు గ్రీన్ సిగ్నల్ – నిర్మాతలకు ఊరట

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సినిమా ప్రేమను చాటుకున్నారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, సినీ రంగంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు పవన్ తీసుకుంటున్న చర్యలు అభిమానుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. తాజాగా, పవన్ తన పెండింగ్ సినిమాలపై ప్రత్యేక దృష్టి సారించారు. విశ్రాంతిలో ఉన్నప్పటికీ, వెన్నునొప్పి బాధిస్తుండగానే నిర్మాతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆయన ఈ చర్చలో చేసిన ప్లానింగ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కీలక మీటింగ్‌కు ప్రముఖ నిర్మాతలు ఏఎం రత్నం, డీవీవీ దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్ ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి చర్చ జరిగింది. ఈ సినిమా అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. అయితే, పవన్ దీన్ని పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఏడాది మేలో సినిమాను విడుదల చేసేలా పవన్ గట్టి హామీ ఇచ్చినట్లు సమాచారం.అంతేకాదు, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓజీ’, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలు కూడా పవన్ ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు సమాచారం.

Pawan Kalyan పవన్ కళ్యాణ్ ఫిలింలకు గ్రీన్ సిగ్నల్ – నిర్మాతలకు ఊరట
Pawan Kalyan పవన్ కళ్యాణ్ ఫిలింలకు గ్రీన్ సిగ్నల్ – నిర్మాతలకు ఊరట

జులై నుంచి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం డేట్స్ కేటాయిస్తానని పవన్ చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.ఈ సందర్భంగా పవన్ చేసిన మరో వ్యాఖ్య ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తన చివరి సినిమా కావొచ్చని పవన్ సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే, సినిమాల నుంచి పూర్తిగా గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నారని భావిస్తున్నారు.ఒకవైపు ప్రభుత్వ బాధ్యతలు, మరోవైపు సినిమా కమిట్‌మెంట్లు – రెండింటినీ సమర్థంగా నిర్వహించేందుకు పవన్ చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. చాలా కాలంగా ఎదురు చూస్తున్న నిర్మాతలకు, అభిమానులకు ఇది నిజంగా సంతోషకరమైన విషయం.ఈ నిర్ణయం వల్ల ఇప్పటివరకు అర్థాంతరంగా ఆగిపోయిన సినిమాలకు పునర్జీవం లభించినట్లైంది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పవన్ రాజకీయాల్లో ఉన్నా కూడా తన సినీ అభిమానులను మరిచిపోకపోవడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం.ఇకపై పవన్ నటించిన సినిమాలు తెరపై కనిపిస్తాయా? ‘ఉస్తాద్ భగత్ సింగ్’తోనే ఆయన సినీ ప్రస్థానం ముగుస్తుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కానీ ఇప్పటివరకు తెలిసినదాని ప్రకారం, పవన్ మాత్రం తన మాట నిలబెట్టుకునే పనిలో ఉన్నారు.

Read Also : Akhanda 2: ‘అఖండ 2’లో విజయశాంతి నటించనుంద

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870