నారా దేవాన్ష్ ని అభినందించిన పవన్ కళ్యాణ్

నారా దేవాన్ష్ ని అభినందించిన పవన్ కళ్యాణ్

ఐటీ, హెచ్‌ఆర్‌డీ మంత్రి నారా లోకేష్ కుమారుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ష్ ఇటీవల 175 చెస్ పజిల్స్‌ను కేవలం 11 నిమిషాల 59 సెకన్లలో పూర్తి చేయడం ద్వారా పేరు తెచ్చుకున్నాడు. ఈ ఘనత అతనికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి పెట్టింది. చెస్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పినందుకు గాను నారా దేవాన్ష్‌ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు.

నారా దేవాన్ష్ ని అభినందించిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ నారా దేవాన్ష్ కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఇంత చిన్న వయసులోనే చెస్ పజిల్స్‌ను విజయవంతంగా పూర్తి చేయడం అతని మేధస్సుకు అద్దం పడుతుంది అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో దేవాన్ష్ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలను సాధించి తెలుగు ప్రజల గర్వకారణంగా నిలుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Posts
యూనివ‌ర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై లోకేశ్ వివరణ
యూనివ‌ర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై లోకేశ్ వివరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అక్రమాలకు ఇకపై తావుండదని, తప్పు చేసేవారు భయపడేలా కూటమి ప్రభుత్వ చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో Read more

నూతన ఏపీ భవన్ నిర్మాణానికి టెండర్లు
ap bhavan delhi

ఏపీ ప్రభుత్వం ఢిల్లీలో నూతన ఏపీ భవన్ నిర్మాణానికి సిద్ధమవుతూ, "రీడెవలప్మెంట్ ఆఫ్ ఏపీ భవన్" పేరుతో డిజైన్లకు టెండర్లను ఆహ్వానించింది. కొత్త భవన్ నిర్మాణాన్ని మొత్తం Read more

ఆప్ వెనుకంజకి ప్రధాన కారణాలు ఏంటి?
ఆప్ వెనుకంజకి ప్రధాన కారణాలు ఏంటి?

ఢిల్లీలో జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) భారీ ఎదురుదెబ్బ ఎదుర్కొంది. గత ఎన్నికల్లో బీజేపీని సింగిల్ డిజిట్ స్కోర్‌కు పరిమితం చేసిన Read more

ఏపీలో మరో రెండు బీసీ గురుకులాలు
Two more BC Gurukulas in AP

ఏపీలో ప్రస్తుతం 107 బీసీ గురుకులాలు ఉన్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు కొత్త గురుకులాలను ప్రారంభించనుంది. ఈ గురుకులాలు Read more