Pawan Kalyan anger over the demolition of Muthyalamma statue in Secunderabad

సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహం ద్వంసంపై పవన్ కల్యాణ్ ఆగ్ర‌హం

హైదరాబాద్‌: ఈ నెల 13 ఆదివారం అర్దరాత్రి సమయంలోతెలంగాణలో జరిగిన అమ్మవారి విగ్రహ ధ్వంసంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. సికింద్రాబాద్‌ ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం దుర్మార్గం అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమ్మవారి విగ్రహం కూల్చడం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మహాపచారం అని అన్నారు.

Advertisements

గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలను ఇలా అపవిత్రం చేయడం చూశానని జ‌న‌సేనాని పేర్కొన్నారు. ఇటీవ‌లి కాలంలో బంగ్లాదేశ్‌లో హిందూ దేవాల‌యాల‌ను అప‌వ్రితం చేయ‌డం అల‌వాటుగా మారింది. ఇటువంటి దుర్మార్గాలపై చాలా బలమైన చర్యలు అవసరమన్నారు.

అందుకే తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో చెప్పానని ప‌వ‌న్ పేర్కొన్నారు. ఇటువంటి అకృత్యాలు పునరావృతం కాకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ మేర‌కు జ‌న‌సేనాని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక లేఖ‌ను విడుద‌ల చేశారు.

కాగా, సికింద్రాబాద్‌ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. విగ్రహం కూల్చివేయడం తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీసింది. హిందూత్వ సంఘాలు ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇప్పటికే ఈ సంఘటనలో కొందరిని అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Related Posts
భక్తులు దర్శనం కోసం వస్తే వైకుంఠానికే పంపుతున్నారు : వైఎస్‌ షర్మిల
ys sharmila

వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతికి వస్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారని ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. మొన్న లడ్డు కల్తీ.. నేడు Read more

కరెంట్ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన
electricity bill

తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ ఛార్జీల పెరుగుదలపై చర్చ జరుగుతున్న సమయంలో, డిస్కం (డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) సీఎండీ ముషారఫ్ కరెంట్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. హైటెన్షన్ ఇండస్ట్రియల్ Read more

సోషల్ మీడియా వయస్సు నిర్ధారణ కోసం బయోమెట్రిక్స్: ఆస్ట్రేలియా
Australia PM

"16 సంవత్సరాలు కంటే తక్కువ వయస్సు గల వ్యక్తులు సోషల్ మీడియా ఉపయోగించడానికి అనుమతి ఇవ్వబడదు", అని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంతోనీ ఆల్బనీస్ సోమవారం తెలిపారు. Read more

ఈనెల 30 నుండి బీఆర్‌ఎస్‌ “గురుకుల బాట” కార్యక్రమం: కేటీఆర్‌
Will march across the state. KTR key announcement

హైదరాబాద్‌ : గురుకులాల్లో చోటు చేసుకుంటున్న వరుస విషాద ఘటనల నేపథ్యంలో ఈనెల 30 నుండి డిసెంబర్‌ ఏడో తేదీ వరకు బీఆర్ఎస్‌ పార్టీ తరపున "గురుకుల Read more