ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం (Coalition Government) ఏర్పడి ఏడాది విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా “సుపరిపాలనలో తొలి అడుగు” (Suparipalanalo Tholi Adugu) పేరుతో అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు అనేక సమస్యలతో బాధపడిన విషయాన్ని గుర్తుచేస్తూ, అదే కారణంగా ప్రజలు అఖండ మెజారిటీతో కూటమిని గెలిపించారని తెలిపారు.
వైసీపీ హయాంలో ప్రజలకు కలిగిన ఇబ్బందులు
గత ప్రభుత్వం పాలనను పవన్ తీవ్రంగా విమర్శించారు. అధికార యంత్రాంగం భయంతో పనిచేసిన దుస్థితిని వివరిస్తూ, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిని సైతం వేధించిన ఘటనలను ప్రస్తావించారు. “చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవు, రైతులకు భరోసా లేదు, మహిళలకు రక్షణ లేదు – ఇదే వైసీపీ పాలన సారాంశం. అలాంటి పాలన తిరిగి రాకుండా ప్రజలు చరిత్రే తిరగరాశారు” అన్నారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సహకారంతో కొత్త పెట్టుబడులు, సంక్షేమ పథకాల అమలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
అరాచకాలను తట్టుకోవడం లేదు – హెచ్చరించిన పవన్
పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో వైసీపీ నేతల వైఖరిపై ఘాటుగా స్పందించారు. “గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలను ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కొనసాగిస్తున్నారు. బెదిరింపులు, హింసను ప్రశ్నిస్తే తాటాకు చప్పుళ్లు వంటివి మాట్లాడుతున్నారు. అలాంటి వారిని చూస్తూ ఊరుకోం, చట్టబద్ధంగా నార తీస్తాం” అంటూ హెచ్చరించారు. ప్రజల శాంతి భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎవరైనా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
Read Also : YCP Govt : గత వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు – పవన్ కళ్యాణ్