అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా పటేల్

అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా పటేల్

అమెరికా ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా భారతీయ సంతతికి చెందిన కాష్ పటేల్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి సంబంధించిన తీర్మానానికి సెనెట్ ఆమోదం తెలిపింది. రెండు ఓట్ల తేడాతో ఈ తీర్మానం ఆమోదం పొందింది. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ పేరును ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. ఇలాంటి పదవులకు సంబంధించిన నియామకాలను సెనెట్ ఆమోదించాల్సి ఉంటుంది. తాజాగా ఈ తీర్మానంపై సెనెట్‌లో ఓటింగ్ నిర్వహించారు. 51-49 ఓట్ల తేడాతో ఈ తీర్మానం ఆమోదం పొందింది.

అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా పటేల్


పటేల్ నియామకాన్ని వ్యతిరేకిస్తోన్న డెమోక్రాట్లు
డెమోక్రటిక్ సెనెటర్లందరూ కూడా దీనికి వ్యతిరేకంగా ఓటు వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అత్యంత కీలకమైన ఎఫ్‌బీఐ చీఫ్‌గా కాష్ పటేల్ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నామనే విషయాన్ని వాళ్లు చెప్పకనే చెప్పినట్టయింది. డెమోక్రటిక్ సెనెటర్ల ఏ ఒక్క ఓటు కూడా తీర్మానానికి అనుకూలంగా పడలేదు. సెనెట్ ఆమోదంతో కాష్ పటేల్‌కు లైన్ క్లియర్ అయింది.
భారత మూలాలు..
కాష్ పటేల్.. పూర్తి పేరు కశ్యప్ ప్రమోద్ వినోద్ పటేల్. ప్రవాస భారతీయుడు. స్వరాష్ట్రం గుజరాత్. 1980లో న్యూయార్క్ గార్డెన్ సిటీలో జన్మించారు. ఆయన తండ్రి అమెరికాలోని ఓ ఏవియేషన్ సంస్థలో ఫైనాన్షియల్ ఆఫీసర్‌. లాంగ్ ఐలండ్‌లోని గార్డెన్ సిటీ హైస్కూల్‌‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నారు కాష్ పటేల్. 2002లో యూనివర్శిటీ ఆఫ్ రిచ్‌మండ్‌లో క్రిమినల్ జస్టిస్‌లో డిగ్రీ చదివారు.
వైట్ హౌస్ అధికారికంగా ప్రకటన
కాష్ పటేల్ నియామకాన్ని వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ ట్వీట్ పోస్ట్ చేసింది. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ నియామకాన్ని ముందడుగుగా అభివర్ణించింది. దేశ సమగ్రతను పునరుద్ధరించడానికి, చట్ట- న్యాయ వ్యవస్థను గాడిన పెట్టడానికి డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తోన్న అజెండాను అమలు చేయడంలో కీలకమైన అడుగు పడిందని పేర్కొంది.

Related Posts
చైనా “ప్రేమ విద్య” ద్వారా యువతలో మంచి దృక్పథాలను పెంచాలనుకుంటున్నదా?
China Medical University

చైనా వివాహం, ప్రేమ, సంతానం మరియు కుటుంబం పై సానుకూల దృక్పథాలను పెంచేందుకు "ప్రేమ విద్య"ను విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టాలని కోరుకుంటోంది. ఈ చర్య దేశంలోని జనాభా పెరుగుదలని Read more

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌ను తిరస్కరించిన ఆప్
ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌ను తిరస్కరించిన ఆప్

27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ అంచనాలను పూర్తిగా తిరస్కరించింది. Read more

ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించిన అరబ్ దేశాలు
ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించిన అరబ్ దేశాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రతిపాదించిన పథకాన్ని అరబ్ దేశాలు తిరస్కరించాయి, ఈ ప్రతిపాదనకు గణనీయమైన ఎదురుదెబ్బ తగిలింది. గాజాలో కొనసాగుతున్న సంఘర్షణతో ప్రభావితమైన పాలస్తీనా Read more

డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ ద్వారా అమెరికాలో ధరలు పెరిగే అవకాశం
trump 3

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో అన్ని సమస్యల పరిష్కారంగా టారిఫ్స్ ని ప్రస్తావించారు. అయితే, ఆర్థికవేత్తలు ఈ టారిఫ్స్ వల్ల సాధారణ అమెరికన్ Read more