పర్వేష్ వర్మకే సీఎం పగ్గాలు?

పర్వేష్ వర్మకే సీఎం పగ్గాలు?

దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈనెల 8న ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ, 10 రోజులు పూర్తయినా ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై ఇప్పటికీ కమలం స్పష్టత ఇవ్వలేదు. ఈ కారణంగా రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు, బీజేపీ శాసనసభా పక్ష సమావేశం ఈనెల 19న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు సీఎం అభ్యర్థిని ఎంపిక చేసి, 20వ తేదీన కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని సమాచారం. ఇదివరకు సీఎం ప్రమాణ స్వీకారం ఇవాళ లేదా రేపట్లో ఉంటుందని ఊహాగానాలు వచ్చినప్పటికీ, తాజా పరిణామాల ప్రకారం ఈ ప్రక్రియ మరికొన్ని రోజులు కొనసాగనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో కొత్త ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరి చేతికి వెళ్తాయన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Advertisements
BJP MP 1

ఢిల్లీ సీఎం పదవికి ముందంజలో పర్వేష్ వర్మ?

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికలో పర్వేష్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్‌పై విజయం సాధించి ఆమ్ ఆద్మీ పార్టీని గట్టి దెబ్బకొట్టిన ఆయనకు పగ్గాలు అప్పగించాలనే ఆలోచన బీజేపీ హైకమాండ్‌లో ఉంది. అయితే రేఖ గుప్తా, విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ, వీరేంద్ర సచ్‌దేవా, బన్సూరి స్వరాజ్, హరీష్ ఖురానా తదితర నేతల పేర్లు కూడా రేసులో ఉన్నాయి.

ప్రమాణ స్వీకార ఏర్పాట్లు వేగంగా:

బీజేపీ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎన్నికకు చర్చలు తారస్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీ ప్రజలు కొత్త సీఎంగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే ఉత్కంఠలో ఉన్నారు. అధిష్ఠానం తుది నిర్ణయాన్ని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అధికారాన్ని దక్కించుకోవడంతో ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో కొత్త సీఎం ప్రమాణం చేయనున్నట్లు సమాచారం 70 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 48 స్థానాలు గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకు పరిమితమైంది.

కొత్త సీఎం ఎవరవుతారనే ఉత్కంఠ:

నూతన సీఎంగా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారన్న ఉత్కంఠ ఢిల్లీ ప్రజల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా నెలకొంది. అధికార ప్రతిష్టను నిలబెట్టేలా బీజేపీ ఎవరి పేరును ఖరారు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

అంతేకాదు, విపక్షాలు కొత్త సీఎంగా ఎవరికి అవకాశం కల్పిస్తారనే దానిపై కూడా నిశితంగా గమనిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయం, కేంద్రం వ్యూహాలు, బీజేపీ లోపలి రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం, అధిష్ఠానం గత ఎన్నికల్లో ప్రదర్శన, ప్రాంతీయ సమీకరణాలు, నాయకత్వ సామర్థ్యాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఢిల్లీ రాజకీయ సమీకరణాల్లో కొత్త కీలక పరిణామాల కోసం ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కొత్త సీఎం పేరు ప్రకటించేందుకు కౌంటింగ్ అనంతరం జరిగిన బీజేపీ శాసనసభా పార్టీ సమావేశాన్ని వేచి చూడాల్సి ఉంది. పార్టీ శ్రేణులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కీలక నిర్ణయం త్వరలో వెలువడనుంది.

Related Posts
మహాకుంభమేళా నుంచి తిరిగొస్తుండగా ఘోర ప్రమాదం
7 Kumbh returnees killed af

జబల్పూర్ జిల్లా సిహోరా వద్ద ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడు మంది తెలుగు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మహాకుంభమేళా ముగించుకొని తిరిగొస్తుండగా, Read more

ఫిబ్రవరిలో ఫ్రాన్స్ టూరు కు ప్రధాని మోదీ
PM Modi to visit France in February

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళనున్నారని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రకటించారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఫ్రాన్స్‌లో జరిగే Read more

శ్వేత వర్ణంలో జమ్ముకశ్మీర్‌
Snowfall Blankets Jammu and Kashmir, Transforming Tourist

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌లో మంచు వర్షం కురుస్తోంది. బారాముల్లా, సోనమార్గ్‌, బందిపోర సహా అనేక ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర Read more

రాజ్యాంగ చర్చ కోసం లోక్ సభ, రాజ్య సభ తేదీలు ఖరారు
parliament

పార్లమెంట్‌లో సోమవారం అన్ని పార్టీల నేతలతో జరిగిన సమావేశం అనంతరం, లోక్ సభ మరియు రాజ్యసభ ఎంపీలు వచ్చే వారం రాజ్యాంగంపై చర్చను నిర్వహించేందుకు అంగీకరించారు. ఈ Read more

×