పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకున్న ఓ దారుణమైన ప్రేమ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రేమ పేరుతో ఓ యువకుడు తన ప్రియురాలి బావను పక్కా స్కెచ్ వేసి హతమార్చిన ఈ ఘటన ప్రస్తుతం అందరిలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. మానవ సంబంధాలు, ప్రేమ, హద్దులు – అన్నీ అడుగడుగునా ప్రశ్నార్థకంగా మారిన ఈ సంఘటన చుట్టూ నెమ్మదిగా నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.కేసు వివరాలు:సాలూరు మండలం (Salur Mandal) పురోహితినివలసకు చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని పక్క గ్రామమైన దేవుబుచెంపేటకు చెందిన గుంట్రెడి శ్యామ్ అలియాస్ శంకరరావుతో పరిచయమైంది. మొదట్లో ఆమె అతనిని పట్టించుకోకపోయినా, కాలక్రమంలో అతడితో మాట్లాడడం మొదలుపెట్టింది. తమ మధ్య ప్రేమాగ్ని రగిలిందని భావించిన శ్యామ్, ఆమెను తరచూ కలుస్తూ ఉండేవాడు. ఈ వ్యవహారాన్ని గమనించిన బాలిక కుటుంబ సభ్యులు, ఆమె మైనర్ కావడం వల్ల శ్యామ్‌ను పలుమార్లు హెచ్చరించారు. ఆమెను వదిలిపెట్టాలని, చెప్పినప్పటికీ, శ్యామ్ వినిపించుకోలేదు.
ప్రియురాలి బావే అడ్డుగా కనిపించాడు
అయినప్పటికీ శ్యామ్ ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే కాలేజ్ హాస్టల్ లో ఉన్న విద్యార్థినికి తన స్నేహితుల సహాయంతో మొబైల్ ఫోన్ అందజేశాడు శ్యామ్. దీంతో విద్యార్థిని కుటుంబసభ్యులు శ్యామ్ (Shyam) ను మరింత గట్టిగా హెచ్చరించాలని నిర్ణయించుకున్నారు. అయితే విద్యార్థిని అక్క భర్త వరుసకు బావ అయిన అబ్ధుల్, శ్యామ్ మంచి స్నేహితులు. వీరిద్దరూ తరచూ కలుస్తుంటారు. ఈ క్రమంలోనే తన మరదలికి ఫోన్ ఇవ్వడం తగదని, ఇలా విద్యార్థిని వెంట పడటం తప్పని, ప్రవర్తన మార్చుకోవాలని శ్యామ్ ను హెచ్చరించాడు అబ్దుల్. దీంతో శ్యామ్ ఎలాగైనా తనతో తన ప్రేమకు అడ్డుపడుతున్న అబ్దుల్ ను అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యి రాత్రి పదకొండు గంటల సమయంలో అబ్దుల్ కి ఫోన్ చేసి తాము ఉన్న ప్రదేశానికి రమ్మని చెప్పాడు. ముందు నుండి ఇద్దరు స్నేహితులు కావడంతో అబ్దుల్ కూడా శ్యామ్ ఫోన్ చేయగానే మరొక స్నేహితుడిని తీసుకొని శ్యామ్ ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు.

శ్యామ్ పట్టరాని కోపంతో అబ్దుల్ పై విరుచుకుపడ్డాడు
అప్పటికే అక్కడ ఐదుగురు స్నేహితులతో శ్యామ్ మద్యం మత్తులో ఉన్నాడు.అబ్దుల్ అక్కడికి వెళ్లగానే శ్యామ్ ను కౌగిలించుకొని మన ఇద్దరం స్నేహితులం, నా మరదలిని వదిలేయ్, ఆమె చిన్న అమ్మాయి, మా కుటుంబం పరువు పోతుందని అర్ధించాడు. అందుకు శ్యామ్ పట్టరాని కోపంతో అబ్దుల్ పై విరుచుకుపడ్డాడు. అక్కడ కొంతసేపు అబ్దుల్ కి, శ్యామ్ కి ఘర్షణ అయ్యింది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన శ్యామ్, పక్కనే ఉన్న కత్తిని తీసుకుని అబ్దుల్ పై దాడి చేశాడు. ఈ దాడిలో అబ్దుల్ తీవ్ర గాయాల పాలయ్యాడు. పరిస్థితి గమనించిన స్నేహితులు వెంటనే అబ్దుల్ ను సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అబ్దుల్ చికిత్స పొందుతూ మరణించాడు.
ఘటనపై దర్యాప్తు
అబ్దుల్ మరణించిన వార్త తెలుసుకున్న శ్యామ్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిమిత్తం అబ్దుల్ మృతదేహాన్ని సాలూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి తరలించారు. ఈ ఘటన విద్యార్థిని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపడమే కాకుండా స్థానికులను భయాందోళనకు గురిచేసింది. పోలీసులు ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. శ్యామ్ పై హత్య నేరం కింద కేసు నమోదు చేశారు. అయితే హత్యలో శ్యామ్ తో పాటు మద్యం మత్తులో ఉన్న స్నేహితుల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన పై పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పార్వతీపురం ఏం కోసం ప్రసిద్ధి చెందింది?
పార్వతీపురం వ్యవసాయం ఆధారిత ప్రాంతం. ఇక్కడ ప్రధానంగా వరి, జీడిపప్పు, మామిడికాయలు, ఇత్తడి చెట్టు (మద్ది), ఇతర తక్కువస్థాయి పంటలను సాగు చేస్తారు.
పార్వతీపురం ఏ రాష్ట్రంలో ఉంది?
పార్వతీపురం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది పార్వతీపురం మన్యం జిల్లాకు ముఖ్య కేంద్రంగా కూడా ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Weather alert: దంచికొడుతున్న వర్షాలతో ప్రజల ఇక్కట్లు