Parliament sessions begin. adjourned within minutes

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం.. నిమిషాల వ్యవధిలోనే వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి. సమావేశాలు ప్రారంభం అయిన నిమిషాల వ్యవధిలోనే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అదానీ వ్యవహారం, యూపీలోని సంభల్‌ హింసాకాండపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడ్డాయి. విపక్ష పార్టీల ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. దీంతో స్పీకర్‌ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అటు ఎగువ సభ లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. విపక్ష ఎంపీల ఆందోళనల మధ్య చైర్మన్‌ ధన్‌ఖర్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

కాగా, శుక్రవారం కూడా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. లోక్‌సభ మధ్యాహ్నం 12.00 గంటల వరకు వాయిదా పడగా, రాజ్యసభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ ప్రకటించారు. రాజ్యసభ ఉదయం 11.00 గంటలకు ప్రారంభం కాగానే నిమిషాల వ్యవధిలో వాయిదా పడింది. అదానీ స్కాం, మణిపూర్‌, సంభాల్‌ హింసాకాండ, బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ పూజారి అరెస్టుపై చర్చ జరపాలని కోరుతూ ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన 17 నోటీసులను చైర్మన్‌ తిరస్కరించారు. అనంతరం సభను (డిసెంబర్‌ 2) సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ ప్రకటించారు. లోక్‌సభలో అదానీ స్కాంపై చర్చ జరపాలంటూ కాంగ్రెస్‌ ఎంపి మాణికం ఠాగూర్‌ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అదానీ సమస్య ”ప్రజా ప్రాముఖ్యత”, మరియు ”భారత పాలన, నియంత్రణ చట్టాలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది” అని తీర్మానంలో పేర్కొన్నారు. సభను స్పీకర్‌ మధ్యాహ్నం 12.00 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Related Posts
ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు
ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు

బోయింగ్ 777 విమానం ముంబయి నుంచి న్యూయార్క్ వెళ్తుంది. నాలుగు గంటల తర్వాత అజర్బైజన్ ప్రాంతంలో గగనతలంలో ఉండగా బెదిరింపులు వచ్చాయి. సిబ్బంది వెంటనే అప్రమత్తమై పైలట్లకు Read more

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌- 12 మంది మావోయిస్టుల మృతి
Massive encounter in Chhatt

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య జరిగిన ఎదురు Read more

బుమ్రా చరిత్ర సృష్టించాడు
బుమ్రా చరిత్ర సృష్టించాడు

భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా జనవరి 1, బుధవారం చరిత్ర సృష్టించాడు. తాజా ICC టెస్ట్ ర్యాంకింగ్స్‌లో, బుమ్రా భారత బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలవడమే కాకుండా, Read more

పోలీసులకు జగన్ వార్నింగ్
jagan warning

పోలీసులు టోపీపై ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ కొట్టాలని జగన్ సూచించారు. ఇలా అమ్ముడుపోయి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం పోలీసులుగా వృత్తిని కించపరచడమే అవుతుందన్నారు. ఎల్లకాలం ఇదే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *