nirmala sitharaman

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఆర్థిక బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, వక్ఫ్ సవరణ బిల్లుతోపాటు మొత్తం 16 ముఖ్యమైన బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.ఈ పార్లమెంట్ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి. మొదటి విడతలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనున్నాయి. తొలిరోజు ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసే ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 2024-25కు సంబంధించిన ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు.

ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. కాగా, ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గురువారం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి కేంద్రమంత్రులు, పలు పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కేంద్ర ప్రభుత్వం అఖిలపక్షానికి అందించింది. ఇందులో వక్ఫ్‌ సవరణ బిల్లు కూడా ఉంది. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను కేంద్రం కోరింది. ముఖ్యమైన అంశాలను చర్చించేందుకు సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు విపక్షాలకు స్పష్టం చేశారు.

Related Posts
ట్రంప్ తో నేరుగా పని చేయాలని అనుకుంటున్నాను – జెలెన్‌స్కీ
ట్రంప్, పుతిన్ ఉచ్చులో జెలెన్స్కీ?

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ, ఫిబ్రవరి 2022 లో ప్రారంభమైన యుద్ధంలో రష్యా దాడులు తీవ్రతరంగా మారటంతో, అమెరికా అధ్యక్షుడు ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తో నేరుగా Read more

బడ్జెట్లో ఉద్యోగాల ఊసేది? బ్యాంకర్స్ అసోసియేషన్ నిరాశ
budget

ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బడ్జెట్‌ను తీవ్రంగా విమర్శించింది. బడ్జెట్‌లో ఉద్యోగాల విషయంలో ఎటువంటి ప్రస్తావన లేకపోవడం వారిని నిరాశకు గురిచేసిందని సంఘం తెలిపింది. ఉద్యోగాలను సృష్టించకుండా Read more

ప్రపంచ కుబేరుల జాబితా.. అరుదైన ఘనతను సొంతం చేసుకున్న జుకర్‌ బర్గ్‌
Zuckerberg passes Bezos to become worlds second richest person

Zuckerberg passes Bezos to become world’s second-richest person న్యూయార్క్‌ : మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే Read more

నటి కాదంబరీ జత్వానీ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం
AP government handed over the investigation of actress Kadambari Jethwani case to CID

అమరావతి: బాలీవుడ్ నటి కాదంబరీ జత్వాని కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు డీజీపీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *