ఇంకా పాన్ కార్డు కోసం మూడు పోర్టళ్ల మధ్య తిరుగులా? ఇక ఆ దశ ముగిసింది. ఆదాయ పన్ను శాఖ ఇప్పుడు ఒకే పాన్ సేవల కేంద్రాన్ని ప్రారంభించబోతోంది. దీని పేరు ‘పాన్ 2.0’.ప్రస్తుతం పాన్ కార్డు లేదా టాన్ కోసం ఈ-ఫైలింగ్ పోర్టల్, యూటీఐఐటీఎస్ఎల్, లేదా ఎన్‌ఎస్‌డీఎల్ ప్రోటీన్ ఈ-గవ్ పోర్టల్స్ వాడాల్సి వస్తోంది. ఇది అనవసర గందరగోళాన్ని తీసుకువస్తోంది. దీనికి పరిష్కారంగా పాన్ 2.0 (PAN 2.0) ఒకే కేంద్రం నుంచి అన్ని సేవలు అందించనుంది.

కొత్త ప్లాట్‌ఫామ్ – అన్నీ ఒకచోటే
పాన్ 2.0 ప్లాట్‌ఫామ్‌లో లభించే సేవలు ఇవే:
కొత్త పాన్ జారీ,
పాత పాన్‌లో మార్పులు,
ఆధార్ అనుసంధానం,
పాన్ కార్డు రీ-ప్రింట్,
ఆన్‌లైన్ వెరిఫికేషన్,
ఇవన్నీ ఇకపై ఒకే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
ప్రాజెక్ట్ బాధ్యత ఎల్టీఐ మైండ్‌ట్రీకి
ఈ మల్టీ-కోర్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను ఎల్టీఐ మైండ్‌ట్రీ చేపట్టింది. ప్రాజెక్ట్ డిజైన్, అభివృద్ధి, అమలు, నిర్వహణను మొత్తం ఈ ఐటీ దిగ్గజమే చూసుకుంటుంది.అధికారుల ప్రకారం, ఈ కొత్త వ్యవస్థ 18 నెలల్లో అందరికీ అందుబాటులోకి రానుంది. అంటే, 2026 మొదట్లోనే పాన్ 2.0 వాడకం మొదలయ్యే అవకాశం (PAN 2.0 likely to be used as early as 2026) ఉంది.ఈ పాన్ 2.0 ప్రాజెక్టు కోసం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రూ. 1,435 కోట్లు మంజూరు చేసింది. ఇది 2024 నవంబర్ 25న అధికారికంగా ఆమోదం పొందింది.
పూర్తిగా పేపర్‌లెస్ – ఉచితంగా అందుబాటులోకి
పాన్ 2.0లో సేవలన్నీ పేపర్‌లెస్ పద్ధతిలో జరుగుతాయి. దరఖాస్తు చేసినవారికి ఈ-మెయిల్ ద్వారా ఈ-పాన్ నేరుగా అందుతుంది. అలాగే ఇది పూర్తిగా ఉచితంగా ఉంటుంది.మీ వద్ద ఇప్పటికే పాన్ ఉంటే, మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా దరఖాస్తు చేయాలసిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.ప్రస్తుతం దేశంలో 81.24 కోట్ల పాన్ కార్డులు, 73 లక్షల టాన్ నంబర్లు వాడుకలో ఉన్నాయి. ఈ సంఖ్య చూస్తే, ఒకే ప్లాట్‌ఫామ్ ఎంత అవసరమో అర్థమవుతుంది.
ఎల్టీఐ మైండ్‌ట్రీ షేర్లు ఎగబాకినట్లు
ఈ ప్రాజెక్టు ప్రకటించిన వెంటనే బీఎస్‌ఈలో ఎల్టీఐ మైండ్‌ట్రీ షేరు ధర 1.42% పెరిగి రూ. 5,088.25కి చేరుకుంది.ఈ ప్రాజెక్టు పన్ను చెల్లింపుదారుల జీవితం సులభతరం చేయనుంది. ఒకే ప్లాట్‌ఫామ్‌లో అన్ని సేవలు ఉండటంతో సమయం, శ్రమ రెండూ బాగా ఆదా అవుతాయి.
Read Also : Tamil Nadu : మొక్కు తీరాలంటే తలపై కొబ్బరికాయ పగలాల్సిందే!