పాకిస్తాన్ కి తగిన శాస్త్రి జరిగింది.

పాకిస్తాన్ కి తగిన శాస్త్రి జరిగింది.

ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ జట్టు వివాదాల్లో చిక్కుకుంది. ఆతిథ్య దేశం పట్ల సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఆ జట్టు ప్లేయర్లు ప్రవర్తించిన విధానంపై మండిపడుతున్నారు. ఆగ్రహావేశాలను తెలియజేస్తోన్నారు.ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు మూడు దేశాల సిరీస్‌కు ఆతిథ్యాన్ని ఇచ్చింది పాకిస్తాన్. న్యూజిలాండ్- పాకిస్తాన్- దక్షిణాఫ్రికా ఇందులో తలపడుతున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా బుధవారం రాత్రి కరాచీ స్టేడియంలో జరిగిన పాకిస్తాన్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో ఈ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.352 పరుగులతో.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. ఓపెనర్ టెంబా బావుమా అద్భుతంగా రాణించాడు. 96 బంతుల్లో 13 ఫోర్లతో 82 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు మాథ్యూ బ్రీట్జ్కె, హెన్రిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు.దుమ్మురేపిన బ్యాటర్లుమాథ్యూ- 84 బంతుల్లో ఒక సిక్స్, 10 ఫోర్లతో 83, క్లాసెన్- 56 బంతుల్లో మూడు సిక్సర్లు, 11 ఫోర్లతో 87 పరుగులు చేశారు. లోయర్ ఆర్డర్‌లో కైలె వెరెన్నె 32 బంతుల్లో 44 పరుగులతో మెరుపు ఇన్నింగ్ ఆడటంతో దక్షిణాఫ్రికా 352 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది.
రెచ్చిపోయిన పాక్
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ రెచ్చిపోయి ఆడింది. ఇంకా ఒక ఓవర్ మిగిలివుండగానే 355 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఆ జట్టు కోల్పోయింది నాలుగు వికెట్లు మాత్రమే. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ ఆఘా సెంచరీలతో చెలరేగారు. రిజ్వాన్- 122, ఆఘా- 134 పరుగులు చేశారు. దీనితో పాకిస్తాన్ 352 పరుగులను అలవోకగా కొట్టిపడేసింది. కాగా- ఈ మ్యాచ్‌లో టెంబా బావుమా పట్ల పాకిస్తాన్ ప్లేయర్లు వ్యవహరించిన తీరు విమర్శలకు కేంద్రబిందువు అయింది. బావుమా రనౌట్ అయినప్పుడు- అతని మీదికి దూసుకెళ్లారు సవూద్ షకీల్, కమ్రాన్ గులాం. సవూద్ షకీల్, కమ్రాన్ గులాం అయితే మరీనూ. నేరుగా బావుమా ముందు నిల్చొని సెలబ్రేట్ చేసుకున్నారు. అంతకుముందు- షహిద్ షా అఫ్రిది కూడా మాథ్యూ బ్రీట్జ్కెతో గొడవ పడ్డాడు.


ఐసీసీ సీరియస్

ఈ పరిణామాలను ఐసీసీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ ముగ్గురు కూడా కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినట్టుగా పరిగణించింది ఐసీసీ. షహీన్ షా అఫ్రిది, సవూద్ షకీల్, కమ్రాన్ గులాంపై భారీ జరిమానా విధించింది. కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని వేర్వేరు ఆర్టికల్స్ కింద ఈ మేరకు ఈ పెనాల్టీ వేసింది. ముగ్గురికీ కోత.. ఆర్టికల్ 2.12 ఉల్లంఘన కింద మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పడింది అఫ్రిదీకి. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ ప్లేయర్‌ను ఉద్దేశపూరకంగా భౌతికంగా అడ్డుకోవడానికి లేదా వాగ్యుద్ధానికి దిగడాన్ని ఈ ఆర్టికల్ కింద ఉల్లంఘనగా పరిగణిస్తారు. సవూద్ షకీల్, కమ్రాన్ గులాంకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత పెట్టింది ఐసీసీ. దూకుడుగా స్పందించడం, ఆ తరహా ప్రవర్తించడం, రెచ్చగొట్టేలా ప్రవర్తించితే ఈ నిబంధనను ఉల్లంఘించినట్టవుతుంది.

348074.3

Related Posts
ఉద్యోగాలు మానేస్తున్న భారతీయ విద్యార్థులు!
students

గతేడాది సెప్టెంబర్ నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినప్పటి నుంచి.. అమెరికాలో ఉండే విదేశీయుల్లో ఆందోళన మొదలైంది. ఎక్కడ తాము బహిష్కరణకు Read more

గాజా అమ్మకానికి లేదు: హమాస్
గాజా అమ్మకానికి లేదు: హమాస్

గాజా స్ట్రిప్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గతవారం ప్రతిపాదించారు. స్ట్రిప్‌ను అభివృద్ధి చేసి, దానిని 'రివేరా ఆఫ్ మిడిల్ ఈస్ట్'గా Read more

America: భారతీయ స్కాలర్‌ను అమెరికా ఎందుకు అరెస్ట్ చేసింది?
భారతీయ స్కాలర్‌ను అమెరికా ఎందుకు అరెస్ట్ చేసింది?

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భారత సంతతి రీసర్చ్ స్కాలర్ బదర్ ఖాన్ సురిని అమెరికానుంచి బహిష్కరించవద్దని ఆదేశిస్తూ అమెరికన్ కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. Read more

కోహ్లీ పై పాకిస్థాన్ స్పిన్నర్ కామెంట్స్
కోహ్లీ పై పాకిస్థాన్ స్పిన్నర్ కామెంట్స్

అబ్రార్ అహ్మద్ చెప్పిన కోహ్లీపై ఆసక్తికరమైన విషయాలు పాకిస్థాన్ క్రికెట్ జట్టు స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఇటీవల తన బౌలింగ్ అనుభవాన్ని పంచుకున్నారు, దీనిలో ఆయన భారత Read more