ఇండియన్ నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్ వెనకున్న పాక్ స్కాలర్ కాల్చివేత

ఇండియన్ నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్ వెనకున్న పాక్ స్కాలర్ కాల్చివేత

ఇండియన్ నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్ వెనకున్న పాక్ స్కాలర్ కాల్చివేత భారత నావికాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్‌కు సహకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ స్కాలర్ ముఫ్తీ షా మిర్ హత్యకు గురయ్యాడు. శుక్రవారం రాత్రి బలూచిస్థాన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మసీదులో ప్రార్థనలు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న మిర్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. టుర్బట్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి మసీదులో ప్రార్థనలు ముగించుకున్న ముఫ్తీ షా మిర్ బయటకు వచ్చాడు. అప్పటికే మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతన్ని గమనించి వెంటాడారు. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో పలుమార్లు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన మిర్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.

Advertisements

ఇది ఒక్కసారిగా జరిగిన దాడి కాదు

ముఫ్తీ షా మిర్ గతంలో కూడా ఇలాంటి దాడుల నుంచి తప్పించుకున్నాడు. గత రెండుసార్లు అతడిపై కాల్పులు జరిగాయి. కానీ ఈసారి మాత్రం అతను తూటాలకు బలయ్యాడు. జమియత్ ఉలేమా-ఈ-ఇస్లామ్ (జేయూఐ) సభ్యుడైన ముఫ్తీ ఓ స్కాలర్‌ ముసుగులో వివిధ అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనేవాడు. ఆయుధాలు, మానవ అక్రమ రవాణా వంటి తప్పిద చర్యలతో ఐఎస్ఐకి అత్యంత సన్నిహితుడిగా మారాడు. అతడు తరచూ పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలను సందర్శించేవాడు. అంతేకాదు, భారత భూభాగంలోకి ఉగ్రవాదులను చొప్పించడం కోసం కూడా ప్రణాళికలు రూపొందించేవాడు.

ఖుజ్దార్‌లో మరో దాడి – మిర్ అనుచరుల హత్య

ఇదే ఘటనలో మరో మలుపు ఏమిటంటే, గతవారం ఖుజ్దార్‌లో ముఫ్తీ మిర్ పార్టీకి చెందిన రెండు కీలక వ్యక్తులను గుర్తు తెలియని దుండగులు హత్య దీంతో, ఈ దాడుల వెనక ఉన్న అసలు కారణాలు ఏమిటనే అంశంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హత్య వెనుక ఎవరు

ముఫ్తీ మిర్ హత్యపై పాకిస్థాన్ అధికారులు ఇంకా స్పందించలేదు. కానీ, ఇది అంతర్గత దాడా? లేక మరో కుట్రా? అన్నదానిపై చర్చ మొదలైంది. అతడి చావుతో పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థలు, గూఢచార వ్యవస్థ మధ్య లోపలి విభేదాలు బహిరంగమయ్యాయనే వాదన పెరుగుతోంది.ప్రస్తుతం ముఫ్తీ హత్య వెనుక ఎవరు ఉన్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. భారతీయ నిఘా సంస్థల పాత్ర ఉందా? లేక అతడి చర్యలతో అసంతృప్తిగా ఉన్న ఉగ్రవాద గుంపులే హత్యకు పాల్పడ్డాయా? అనే అంశంపై పాకిస్థాన్ ప్రభుత్వ దర్యాప్తు వేగంగా జరుగుతోంది. ఈ ఘటనతో పాక్ గూఢచారి వ్యవస్థ, ఉగ్రవాద ముఠాల కదలికలపై కొత్త చర్చ ముఫ్తీ మిర్ మృతితో పాకిస్థాన్‌లోని ఉగ్ర గుంపుల భవిష్యత్తు ఏం అనే అంశంపై ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశముంది.

Related Posts
SSC Public Exams 2025: పదో తరగతి పరీక్షలకు కీలక సూచనలు
పదో తరగతి విద్యార్థులకు ముఖ్య సూచనలు

రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పదో తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు Read more

ఇకపై ఆన్లైన్లో టెన్త్ సర్టిఫికెట్లు
online certificate

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పదో తరగతి సర్టిఫికెట్లు ఇక నుంచి ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. ఇది విద్యార్థులు, వారి Read more

యష్ పుట్టినరోజు: అభిమానులకు విజ్ఞప్తి
యష్ పుట్టినరోజు: అభిమానులకు విజ్ఞప్తి

కన్నడ చిత్రపరిశ్రమలో స్టార్‌గా ఎదిగిన యష్, తన పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో అభిమానులంతా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.యష్ పుట్టినరోజు: అభిమానులకు విజ్ఞప్తి, 'కేజీఎఫ్' ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా Read more

డాక్టర్లను, న్యాయవాదులను అధిగమించే AI: ఎలాన్ మస్క్ ఏమంటున్నారు?
Elon Musk

ఎలాన్ మస్క్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యొక్క వేగవంతమైన అభివృద్ధిపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఆయన చెప్పినట్లు, AI సాధనాలు, ముఖ్యంగా చాట్GPT, ప్రస్తుత కాలంలో పెద్ద Read more

×