Pakistan rules out bilateral talks with India during Jaishankars visit

షాంఘై సదస్సు.. భారత్‌తో ద్వైపాక్షిక చర్చలు ఉండవ్ : పాకిస్తాన్

న్యూఢిల్లీ : ఇస్లామాబాద్ వేదికగా అక్టోబర్ 15-16 మధ్య షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సు జరగనున్న నేపథ్యంలో ఆతిథ్య దేశం పాకిస్థాన్ కీలక ప్రకటన చేసింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ పాక్ పర్యటన సందర్భంగా భారత్‌తో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు ఉండబోవని స్పష్టం చేసింది. చర్చలకు అవకాశం లేదని తెలిపింది. ఈ మేరకు పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

Advertisements

జైశంకర్ పర్యటన, భారత్-పాకిస్థాన్ సంబంధాలపై మీడియా ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ‘‘భారత బృందం పర్యటనకు సంబంధించి పాకిస్థాన్ స్పష్టమైన విధానంతో ఉంది. సభ్యులందరినీ స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక భారత్‌తో ద్వైపాక్షిక సమావేశాలకు సంబంధించిన మీ ప్రశ్నకు అక్టోబర్ 5న భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించాలనుకుంటున్నాను. నా పర్యటన పాక్షిక కార్యక్రమమని జైశంకర్ చెప్పారు. పాకిస్థాన్‌తో చర్చల కోసం కాదన్నారు. ఈ వ్యాఖ్యలు వివరణాత్మకమైనవి’’ అని ముంతాజ్ జహ్రా బలోచ్ ప్రస్తావించారు.

కాగా, ఇస్లామాబాద్‌లో జరిగే ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు వెళ్లనున్న భారత బృందానికి విదేశాంగమంత్రి జైశంకర్ నేతృత్వం వహిస్తారని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

Related Posts
కేఎల్‌హెచ్‌ బాచుపల్లిలో ఏఐ అభివృద్ధి
KLH Bachupally is developing sustainability in AI

ఢిల్లీ : నేటి శక్తివంతమైన ప్రొఫెషనల్ ప్రపంచంలో రాణించడానికి అవసరమైన కీలకమైన నైపుణ్యాలు మరియు జ్ఞానంతో విద్యార్థులను సన్నద్ధం చేయడం లక్ష్యంగా KLH బాచుపల్లి క్యాంపస్ ఇటీవల Read more

కెనడా: యూరేనియంతో న్యూక్లియర్ ఎనర్జీ “సూపర్ పవర్”గా మారే అవకాశాలు
Canada Takes the Forefront in the Nuclear Energy Surge

న్యూక్లియర్ ఎనర్జీపై మరింత దృష్టి పెడుతున్న నేపథ్యంలో, యూరేనియం ప్రాముఖ్యత మళ్లీ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పు సంక్షోభం పరిష్కారానికి న్యూక్లియర్ ఎనర్జీ ఒక పరిష్కారం కావచ్చు Read more

CM Revanth Reddy : పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదు.. సీఎం హెచ్చరిక
There is no peace if the party crosses the line.. CM warns

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్‌ శాసనసభా పక్షం(సీఎల్పీ) సమావేశం జరిగింది. శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో జరిగిన ఈ భేటీలో.. ప్రధానంగా నాలుగు Read more

Ilaiyaraaja : ఇళయరాజాకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
Ilaiyaraaja ఇళయరాజాకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

Ilaiyaraaja : ఇళయరాజాకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ ఇటీవల లండన్‌లో చారిత్రాత్మకంగా 'వాలియెంట్' సింఫనీ ప్రదర్శించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, నేడు దేశ ప్రధాని Read more

×