భారతదేశం యొక్క చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ (Anil Chouhan) , పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ప్రకారం, పాకిస్థాన్(Pakistan) ఉగ్రవాదాన్ని(Terrorism) ప్రోత్సహించడం ఆపకపోతే, భారత్ దానికి తగిన ప్రతిస్పందన ఇవ్వగలదని హెచ్చరించారు.

బ్లాక్ మెయిల్‌ను భారత్ సహించదు
పహల్గాం (Pahalgam) దాడి లాంటి ఉగ్రదాడుల (Terror attacks) ను భారత్ సహించదని స్పష్టం చేశారు. ఉగ్రవాదం పడగ కింద భారత్ ఉండబోదని తేల్చిచెప్పారు. న్యూక్లియర్ బ్లాక్ మెయిల్‌ను భారత్ ఎట్టిపరిస్థితుల్లో సహించబోదని సీడీఎస్ అన్నారు. పాకిస్థాన్.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే తన విధానంగా మార్చుకుందని విమర్శించారు. కాల్పుల విమరణను ముందుగా పాకిస్థానే కోరిందని, కానీ నీరు రక్తం కలిసి పారవని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ తీరు మారాల్సిందేనని చెప్పారు.
ఆపరేషన్ సింధూర్ సందర్భంగా చిన్నచిన్న నష్టాలు జరిగాయని సీడీఎస్ అనిల్ చౌహాన్ తెలిపారు. అయితే ఈ నష్టాలు భారత సైన్యంపై పెద్దగా ప్రభావం చూపవని అన్నారు. పొరపాట్లను తాము సరిదిద్దుకుంటామని చెప్పారు. అయినా ఇలాంటి సందర్భాల్లో జరిగిన నష్టం కంటే సాధించిన విజయాన్నే చూడాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు, భారత్-పాకిస్థాన్ సంబంధాలలో ఉత్కంఠను పెంచాయి. భారత ప్రభుత్వం, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపకపోతే, తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
Read Also : Gagan Deep: ISI, ఖలిస్తానీతో పాటు ఉగ్రవాదంతో బలమైన సంబంధాలున్న గగన్ దీప్