సరిహద్దుల్లో ఆగని కాల్పులు – ప్రజలు భయంతో బంకర్లలో ఆశ్రయం
భారత వైమానిక దాడుల తరువాత నియంత్రణ రేఖ మరియు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ విస్తృతంగా కాల్పులకు పాల్పడుతోంది. పూంఛ్, రాజౌరి, కుప్వారా జిల్లాలోని సరిహద్దు గ్రామాలపై మోర్టార్లు, ఫిరంగులతో పాక్ రేంజర్లు దాడులకు దిగారు. ఈ కాల్పుల్లో పూంఛ్ జిల్లాలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 142 మంది తీవ్రంగా గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ పర్వైజ్ అహ్మద్ తెలిపారు.భారత (bharath)సైన్యం పాక్ కాల్పులకు సమర్థంగా ప్రతిస్పందిస్తూ వారి పోస్టులను ధ్వంసం చేసింది. పాకిస్తాన్ భయంతో ఏం చేయాలో పాలుపోక, మరింత కాల్పులకు పాల్పడుతోంది. ముఖ్యంగా ప్రజల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద శైలిలో దాడులు జరుపుతోంది. ప్రజలు భయంతో భూగర్భ బంకర్లలో ఆశ్రయం పొందుతున్నారు. మరికొంత మంది సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్తాన్ శాంతి భంగానికి పాల్పడుతుండటంపై తీవ్ర ఆందోళన నెలకొంది. యురి, కర్నాహ్, తంగ్‌ధర్ సెక్టార్లలోనూ కాల్పులు కొనసాగుతుండటంతో భారత ఆర్మీ సమర్థంగా ప్రతిస్పందిస్తోంది. పాక్ సైన్యం భారీ నష్టాన్ని చవిచూస్తున్నట్లు నిఘా సమాచారం చెబుతోంది.

Pakistan : పాకిస్తాన్ కాల్పులతో ఉద్రిక్తత
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జమ్ముకశ్మీర్‌లోని ఐదు సరిహద్దు జిల్లాల్లో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేశారు. జమ్ము, సాంబ, కథువా, రాజౌరి, పూంఛ్ జిల్లాల్లో బుధవారం నుంచి స్కూళ్లు, కళాశాలలు మూసివేయబడినట్లు డివిజినల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. పాక్(pakistan) దాడుల్లో అనేక ఇళ్లు, వాణిజ్య సంస్థలు, వాహనాలు ధ్వంసమయ్యాయి.పంజాబ్ సరిహద్దు జిల్లాలైన ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫజిల్కా, అమృత్‌సర్, గురుదాస్‌పూర్ ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించారు. వరణ్‌కోట్ జిల్లాలో 72 గంటల పాటు అన్ని విద్యాసంస్థలను మూసివేశారు. శ్రీనగర్ సహా దేశవ్యాప్తంగా 18 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేయగా, శ్రీనగర్ విమానాశ్రయం భారత వైమానిక దళం ఆధీనంలోకి తీసుకుంది.ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్ తదితర విమానయాన సంస్థలు దాదాపు 200కి పైగా విమానాలను రద్దు చేశాయి. ఒక్క ఇండిగో కంపెనీ మాత్రమే 165 విమానాలను రద్దు చేసినట్టు వెల్లడించింది.
Read More : Karre Gutta : కర్రెగుట్టలో ఎన్‌కౌంటర్: 22 మంది మావోయిస్టులు హతం