ప్రస్తుతం భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఎక్కడికెళ్లినా మాటల యుద్ధమే.అయితే ఈ గొడవల వెనుక పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మాత్రం అధ్వాన్నం.వాస్తవానికి చిన్న దేశాల కరెన్సీలు కూడా పాకిస్తాన్ కంటే మెరుగుగానే ఉన్నాయి!2025లో భారత రూపాయి కాస్త బలపడింది.అయితే పాకిస్తాన్ రూపాయి మాత్రం నిత్యం పతనమే చూస్తోంది.ఇది కొత్త విషయం కాదు కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి.నేపాల్ ఆఫ్ఘనిస్థాన్, భూటాన్, బంగ్లాదేశ్ కరెన్సీలు మంచి స్థాయిలో ఉన్నాయి.

ఏప్రిల్ 2025 తాజా మారకం విలువలు చూస్తే:
1 అమెరికా డాలర్ = 280 పాకిస్తాన్ రూపాయలు
1 డాలర్ = 132 నేపాలీ రూపాయలు
1 డాలర్ = 87 ఆఫ్ఘనీస్తాన్ అఫ్గాని
1 డాలర్ = 83 భూటాన్ ఎన్జుల్ట్రమ్
1 డాలర్ = 117 బంగ్లాదేశ్ టాకా
1 యూనిట్‌కు పాకిస్తాన్ రూపాయల సరిపోలిక:
1 నేపాలీ రూపాయి = 2.12 పాకిస్తాన్ రూపాయలు
1 అఫ్గాని = 3.21 పాకిస్తాన్ రూపాయలు
1 ఎన్జుల్ట్రమ్ = 3.37 పాకిస్తాన్ రూపాయలు
1 టాకా = 2.39 పాకిస్తాన్ రూపాయలు.పక్కదేశాలతో పోల్చితే ఇది పరాజయం వంటిదే.కరెన్సీ మారకం విలువలో పాకిస్తాన్ బలహీనంగా మారింది.
పాకిస్తాన్ రూపాయి ఇలా పడిపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి:
అస్థిర ప్రభుత్వం – పాలకులు తరచూ మారుతున్నారు.
ఆర్థిక విధానాల లోపాలు – పెట్టుబడిదారుల నమ్మకం తగ్గింది.
విదేశీ కరెన్సీ కొరత – డాలర్ల కొరత తీవ్రంగా ఉంది.
ఐఎంఎఫ్‌పై ఆధారపడటం – తరచూ అప్పులు కోరడం మారనిది.
ద్రవ్యోల్బణం అధికంగా ఉంది – ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ – ఇది విదేశీ కరెన్సీపై ఒత్తిడి పెంచుతోంది.ఈ అన్ని అంశాలు కలిసి పాకిస్తాన్ రూపాయి విలువను కిందకు పడిపోయేలా చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించడం సవాలే.
Read Also : Pope:పోప్ దుస్తులపై కొత్త అధ్యాయం: ఈసారి కాన్క్లేవ్‌కు పాపల్ కాసోక్ ఆర్డర్ లేదు