Pakistan, China colluding against India.. Army Chief

భారత్‌కు వ్యతిరేకంగా పాక్ , చైనా కుమ్మక్కు : ఆర్మీ చీఫ్

న్యూఢిల్లీ: చైనా, పాకిస్థాన్‌లు భారత్‌కు వ్యతిరేకంగా కుమ్మక్కవుతున్నాయని సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండింటి మధ్య ఉన్న కుట్రపూరిత సంబంధాలున్నాయన్న వాస్తవాన్ని భారత్‌ తప్పక అంగీకరించాలన్నారు. ఈ మేరకు ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. రెండు వైపుల నుంచి దేశానికి ముప్పు పొంచి ఉందన్నారు. సైనిక సన్నద్ధత, సరిహద్దుల వెంబడి పరిస్థితులు, బంగ్లాదేశ్‌ అంశం తదితరాల గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

Advertisements
భారత్‌కు వ్యతిరేకంగా పాక్ , చైనా

సన్నిహిత సంబంధాలు మనకు ఆందోళనకరం

పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ మధ్య సంబంధాల గురించి ప్రస్తావిస్తూ.. ఉగ్రవాదానికి ఆ దేశం (పాక్‌) కేంద్రబిందువు. అందువల్ల మనకు పొరుగునున్న ఏ దేశంతోనైనా ఆ దేశం సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం మనకు ఆందోళనకరం. ఇందుకు కారణం.. ఆ దేశాన్ని కూడా ఉగ్రవాద చర్యలను ఉపయోగించుకునే అవకాశం ఉండటమే అని ద్వివేది పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌కు సంబంధించి ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటవుతుందన్నారు.

మనకు యుద్ధ ముప్పు ఉందనేది వాస్తవం

అయితే భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య సైనిక బంధం బలంగానే ఉందని చెప్పారు. చైనా, పాకిస్థాన్‌ల మధ్య వ్యూహాత్మక బంధం గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. వర్చువల్‌ వేదికలపై ఆ రెండు దేశాల మధ్య బంధం వందశాతంగా ఉంది. భౌతికంగా పరిశీలిస్తే.. చైనాలో తయారైన సైనిక ఉత్పత్తులను పాక్‌ వినియోగిస్తోంది. కుమ్మక్కుకు సంబంధించి నేడున్న పరిస్థితి ఇది. దీన్నిబట్టి రెండువైపుల నుంచి ఏకకాలంలో మనకు యుద్ధ ముప్పు ఉందనేది వాస్తవం అని ఆర్మీ చీఫ్‌ పేర్కొన్నారు.

Related Posts
KTR: కేటీఆర్‌పై రెండు కేసులు నమోదు
Two cases registered against KTR

KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నల్గొండ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. పదో తరగతి పరీక్ష మాస్‌ కాపీయింగ్‌ ఘటనపై ఎక్స్‌ పోస్టులు Read more

ఫార్మసీ సీట్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్
Green signal for replacemen

ఏపీలో బీ ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. దీంతో ఫార్మసీ విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి ఉన్నత Read more

అమెరికాలో బర్డ్ ఫ్లూతో తొలి మరణం
bird flu

ప్రపంచాన్ని హ్యూమన్ మెటానిమో వైరస్ (హెచ్‌‌ఎంపీవీ) వైరస్ భయపెడుతున్న వేళ అమెరికాలో తొలి బర్డ్‌ ఫ్లూ (హెచ్5ఎన్1) మరణం కేసు నమోదు కావడం మరింత కలవరానికి గురిచేస్తున్నది. Read more

నిర్లక్ష్యానికి 13 నిండు ప్రాణాలు బలి
mumbai boat accident

ముంబై తీరంలో జరిగిన దారుణ బోటు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం కలచివేస్తోంది. నీల్కమల్ ఫెర్రీ బోటు ప్రమాదానికి ప్రధాన కారణం నిర్లక్ష్యమే అని Read more