Indus Water Treaty: భారత్‌పై పాకిస్తాన్ అధికారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో, సింధు జలాల ఒప్పందం నిలిపివేయడం, సరిహద్దు వద్ద కాల్పులు, అణ్వాయుధాల ముప్పు వంటి అంశాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పాక్‌కు చెందిన ఓ ఆర్మీ అధికారి (Pakistani military spokesperson) భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు జలాల నీటిని అడ్డుకుంటే భారత ప్రజల ఊపిరి తీస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పాకిస్థాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి (Ahmed Sharif Chaudhry) తాజాగా మాట్లాడారు. పాక్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘మాకు వచ్చే నీటిని భారత్ అడ్డుకుంటే అక్కడి ప్రజల ఊపిరి ఆపేస్తాం.
సింధూ నదిలో (Indus River) జలాలకు బదులుగా వారి రక్తం పారుతుంది’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అహ్మద్ షరీఫ్ చౌదరి వ్యాఖ్యలు.. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయూద్ (Hafiz Saeed) వ్యాఖ్యలకు అద్దం పడుతోంది.
కఠినమైన చర్యలు తీసుకుంటాం
భారత్, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ప్రధాని మోదీ, ఉగ్రవాదులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పాక్ అణ్వాయుధాలు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.
ఐరాస సమావేశం
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలపై ఐరాస భద్రతా మండలి రహస్య సమావేశం నిర్వహించింది. పాక్, సింధు జలాల ఒప్పందం నిలిపివేయడం, సరిహద్దు కాల్పులపై చర్చించింది. భారత్, ఈ అంశాలను ద్వైపాక్షికంగా పరిష్కరించాలని సూచించింది.
Read Also : Japan: భారత్‌పై జపాన్ నిపుణుల ప్రశంసలు- పాకిస్థాన్‌కు చురకలు!