భారత్ లో పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను అమెరికా విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. టిఆర్ఎఫ్ అనేది పాకిస్థాన్ ఆధారిత లష్కరే తొయిబా (ఎస్ఇటి) సంస్థకు అనుబంధ సంస్థగా పనిచేస్తోందని అమెరికా విదేశాంగ శాఖమంత్రి పేర్కొన్నారు. యుఎన్ భద్రతామండలి నేరుగా టిఆర్ఎఫ్పై ఆంక్షలు విధించాలని భారత్ ప్రయత్నిస్తోంది. దానికి అమెరికా (America) మద్దతు లభించింది. టిఆర్ఎఫ్ని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని భారత్ చాలాకాలం నుంచి ప్రయత్నిస్తోంది.ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి తరువాత, ఆ సంస్థపై ఐక్యరాజ్యసమితిలో ఆంక్షలు విధించేందుకు భారత్ దౌత్యపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. భారత బృందం యుఎన్ 1267 ఆంక్షల కమిటీతో కూడా చర్చలు జరిపింది. అలాగే యుఎన్ భద్రతామండలి ఆంక్షల పర్యవేక్షణ బృందం తాజాగా విడుదల చేసిన నివేదికలో పహల్గాం దాడికి టిఆర్ఎఫ్ 2సార్లు బాధ్యత వహించిందని, దాడి జరిగిన ప్రదేశంఫోటోను కూడా ప్రచురించిందని పేర్కొంది. ఈ దాడు లష్కరే తొయిబా మద్దతు లేకుండా జరగడం అసాధ్యమని కూడా ఈ నివేదికప్రస్తావించారు.
ఉగ్రవాద సంస్థగా ప్రకటన
భారత ప్రభుత్వం 2023 జనవరిలో ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం’ (యుఎపిఎ)కింద ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. పహల్గాం దాడిని ఖండిస్తూ యుఎన్ భద్రతా మండలిలో తీసుకున్న తీర్మానంలో టిఆర్ఎఫ్ పేరును చేర్చకుండా పాకిస్తాన్ అడ్డుకుందని, ఆ విషయాన్ని ఆదేశ విదేశాంగ మంత్రి ఇషాక్టార్ స్వయంగా ఒప్పుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఇటీవల ఆయన తనమాట మార్చి, టిఆర్ఎఫ్ఎపై ఆంక్షలకు తమకు అభ్యంతరం లేదని చెప్పడం గమనార్హం. యుఎన్ భద్రతా మండలి నివేదికలో పహల్గాం దాడి (Pahalgam attack) కిటిఆర్ఎఫ్ రెండుసార్లు బాధ్యత వహించిందని, దాడి జరిగిన ప్రదేశం ఫోటోను కూడా ప్రచురించిందని పేర్కొంది. ఇదిఇండియాకు పెద్దవిజయం అనే చెప్పుకోవాలి.

న్యాయమే గెలుస్తుంది
అమాయక ప్రజలను బలిగొన్న ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న పాకిస్థాన్ తమ తప్పు ఏమీ లేదని పదేపదే చెబుతూ, భారత్ పై అసత్యఆరోపణలు చేస్తున్న పాకిస్తాన్ కు ఈ చర్య చెంపదెబ్బలా అయిందని ఇండియన్ అధికారులు అంటున్నారు. పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు 26మందిని పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. పురుషులనే లక్ష్యంగా చేసుకుని, హతమార్చడంతో భారత్ యుద్ధానికి దిగింది.
పహల్గాం దాడిపై అమెరికా స్పందన ఏమిటి?
అమెరికా ఈ దాడి తరువాత TRFను విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. అంతర్జాతీయంగా ఆంక్షలు విధించేందుకు మద్దతు ప్రకటించింది.
TRFపై ఉన్న ప్రధాన ఆరోపణ ఏమిటి?
TRF పహల్గాం దాడి జరిగిన ప్రదేశం ఫోటోలు విడుదల చేసి, దాడి బాధ్యతను రెండు సార్లు స్వీకరించింది. నివేదిక ప్రకారం లష్కరే తోయిబా మద్దతు లేకుండా ఈ దాడి జరగడం అసాధ్యమని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: World Tiger Day: పులితోనే జీవవైవిధ్యం