Our party will contest alone: ​​Atishi

తమ పార్టీ ఒంటరిగా పోటీ : అతిశీ

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిశీ గోవాలో మీడియాతో మాట్లాడుతూ.. గోవా, గుజరాత్‌లలో తాము సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నామని వెల్లడించారు. కూటమిగా పోటీ చేయడంపై ఇప్పటి వరకు ఎవరితోనూ చర్చించలేదన్నారు. గుజరాత్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సహా ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని తెలిపారు. తమ పార్టీ నుండి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిస్తే, వారు రెండు నెలలు కూడా ప్రతిపక్షంలో ఉండరని ప్రచారం చేశారని, కానీ వారు ఇప్పటికీ పార్టీలోనే ఉన్నారని పేర్కొన్నారు.

Advertisements
తమ పార్టీ ఒంటరిగా పోటీ

రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించాలనుకోలేదు

2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోవాలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ నుండి గెలిచిన 11 మందిలో ఎనిమిది మంది బీజేపీలో చేరారని ఆమె గుర్తు చేశారు. రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించాలనుకోలేదు కాబట్టే వారు ఇప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీలోనే ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన 11 మందిలో ఎనిమిది మంది బీజేపీలో చేరాక, ఇంకా భావసారూప్యత ఎక్కడుందని ప్రశ్నించారు. బీజేపీ తమ ఎమ్మెల్యేలను కూడా ఆకర్షించినప్పటికీ వారు పార్టీ మారలేదని అన్నారు. ఎందుకంటే, తమకు రాజకీయాలంటే ప్రజాసేవ అని ఆమె వ్యాఖ్యానించారు.

ప్రజలకు ఏం జరుగుతుందనేదే ముఖ్యం

ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతే విద్యుత్ కోతలు మొదలవుతాయని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఉండదని కేజ్రీవాల్ ముందే హెచ్చరించారని గుర్తు చేశారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపై అతిశీ స్పందిస్తూ, తమ పార్టీకి ఏం జరుగుతుందనే విషయంతో తమకు సంబంధం లేదని, ప్రజలకు ఏం జరుగుతుందనేదే ముఖ్యమని అన్నారు. అధికారంలోకి వచ్చాక 250 మొహల్లా క్లినిక్‌లను మూసివేస్తామని బీజేపీ ప్రకటించిందని, ఉచిత మందులను కూడా నిలిపివేస్తామని చెబుతోందని అన్నారు.

Related Posts
ఆల్ టైం రికార్డ్ సృష్టించిన పుష్ప -2 ట్రైలర్
pushpa 2 trailer views

పుష్ప 2 ట్రైలర్ తోనే ఈ రేంజ్ రికార్డ్స్ సృష్టిస్తుంటే..సినిమా ఏ రేంజ్ లో రికార్డ్స్ సృష్టిస్తుందో అని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ – Read more

యూపీ, తమిళనాడులో ఉప ఎన్నికలు
elections

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోపాటే ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. Read more

‘తీన్మార్ మల్లన్న’ ఏ పార్టీ వ్యక్తి..? ఈ విమర్శలు ఏంటి..?
teenmar mallanna

హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కులగణన నివేదికపై Read more

వంశీ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
Hearing on Vallabhaneni Vamsi bail petition postponed

అమరావతి: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. వంశీకి బెయిల్‌ మంజూరు చేస్తే సాక్ష్యాలను Read more

Advertisements
×