Opposition protest in Parliament angered Speaker

పార్లమెంట్‌లో విపక్షాల నిరసన..స్పీకర్‌ ఆగ్రహం

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమావేశాల్లో భాగంగా శనివారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్‌ సమర్పించిన అనంతరం ఉభయసభలు ఈరోజుకి వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు తిరిగి ప్రారంభమయ్యాయి.

Advertisements

అయితే సమావేశాలు ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా లోక్‌సభలో గందరగోళం నెలకొంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఇటీవలే తొక్కిసలాట ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చర్చించాలని విపక్ష పార్టీల ఎంపీలు పట్టుబట్టాయి. వెల్‌లోకి వచ్చిన విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

image

మృతుల జాబితాను విడుదల చేయాలని ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత మరణాలను ధృవీకరించడంపై సందేహం వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. సభలో ఎంపీల తీరుపై స్పీకర్‌ ఓం బిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభను సజావుగా నడిపేందుకు ప్రతిపక్షాలు ఇష్టపడటం లేదంటూ మండిపడ్డారు.

Related Posts
International Cricket : అంతర్జాతీయ క్రికెట్లో కొత్త రూల్స్!
International Cricket

అంతర్జాతీయ క్రికెట్‌లో త్వరలో కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి వచ్చే అవకాశముంది. క్రికెట్‌లో మెరుగైన సమతుల్యత, పోటీ పరంగా మరింత ఉత్కంఠను సృష్టించే దిశగా ఈ మార్పులు Read more

చంద్రబాబుకు జగన్ వార్నింగ్
అసెంబ్లీ సమావేశాల నుంచి జగన్ వాకౌట్

చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రైతుల పరిస్థితిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు Read more

భారత్-చైనా సరిహద్దు సమస్యలు: శాంతి కోసం విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యలు
S Jaishankar

2020లో లడఖ్‌లో జరిగిన సరిహద్దు ఘర్షణలు భారత్-చైనా సంబంధాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ ఘర్షణల కారణంగా సరిహద్దులపై టెన్షన్స్ పెరిగాయి మరియు రెండు దేశాల మధ్య బలమైన Read more

TG High court : హెచ్‌సీయూ భూములపై విచారణ రేపటికి వాయిదా
Hearing on HCU lands postponed to tomorrow

TG High court : తెలంగాణ హైకోర్టులో కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2:15కి వాయిదా వేసింది. రేపటి వరకు హెచ్‌సీయూ Read more

×