ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL (Telecom company BSNL) ఓ దేశభక్తి కలిగిన ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరిట ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ వినియోగదారులకు సేవలతో పాటు దేశ రక్షణ కోసం సహాయం చేసే అవకాశం కల్పిస్తోంది. రూ.1499 విలువ గల ఈ ప్లాన్‌లో మీరు పొందే లాభాలు మాత్రమే కాకుండా, సైనికులకూ మద్దతు ఇచ్చే చాన్స్ ఉంది.ఈ ప్లాన్‌ద్వారా మీరు రూ.1499 చెల్లిస్తే దాని 2.5% భాగాన్ని (అంటే ₹37.48) రక్షణ శాఖకు డొనేట్ చేస్తారు. అదే సమయంలో, అంతే మొత్తాన్ని మీ ఖాతాలో క్యాష్‌బ్యాక్గా పొందుతారు. అంటే, దేశ రక్షణకు మద్దతు ఇస్తూనే మీకు చిన్న ఊరట కూడా లభిస్తుంది.

వాలిడిటీ 336 రోజులు, పైగా బోనస్ 30 రోజులు
ఈ ప్లాన్‌కి 336 రోజుల గడువు ఉండగా, 30 రోజులు అదనంగా లభిస్తుంది. అంటే మొత్తంగా 366 రోజులు ఈ ప్లాన్ సేవలు పొందవచ్చు.
ఫీచర్లు ఇలా ఉన్నాయి
వాయిస్ కాల్స్: అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాల్స్.
SMSలు: రోజుకు 100 ఫ్రీ మెసేజులు.
డేటా: మొత్తం 24GB వరకు. ఆ తర్వాత 40Kbps స్పీడ్.
రోజు ఖర్చు: సగటున కేవలం ₹4.5 మాత్రమే.
ప్లాన్ ఎవరికీ సరిపోతుంది?
ఈ ప్లాన్ ఎక్కువగా కాలింగ్, SMS వాడే వారికి సరైన ఎంపిక. తక్కువ డేటా అవసరమవుతుంటే, దీర్ఘకాలిక వాలిడిటీతో ఇది చాలాసౌకర్యంగా ఉంటుంది.
ఆఫర్ చివరి తేదీ: జూన్ 30, 2025
ఈ ప్రత్యేకమైన ఆఫర్ జూన్ 30, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందుకే, త్వరగా రీచార్జ్ చేసుకోవడం మేలని చెబుతున్నారు నిపుణులు.
రీచార్జ్ చేసుకునే విధానం
BSNL వెబ్‌సైట్ లేదా MyBSNL యాప్ ఓపెన్ చేయండి.
₹1499 ప్లాన్‌ను సెలెక్ట్ చేసి.
UPI, డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించండి.
బిలింగ్ పూర్తయిన తర్వాత, క్యాష్‌బ్యాక్ క్రెడిట్ అవుతుంది.
నిజమైన సేవా భావనతో కూడిన ఆఫర్
ఈ ప్లాన్ ద్వారా మీరు మీ అవసరాలు తీరుస్తూనే భారత సైనికులకు గౌరవంగా సహాయపడతారు. ఇలా టెక్నాలజీతో దేశసేవను కలిపిన BSNL ఆపరేషన్ సిందూర్ ఆఫర్ నిజంగా ప్రత్యేకమైనదిగా నిలిచింది.
Read Also : Lioness : వీధిలో నిద్రిస్తున్న వ్యక్తి వద్దకు సింహం!