ప్రస్తుతం ప్రపంచ ఐటీ, టెక్ రంగంలో లే ఆఫ్స్ (ఉద్యోగ తొలగింపులు) కల్లోలం సృష్టిస్తున్నాయి. ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవాలని నిర్ణయించుకోవడంతో వేలాదిమంది ఉద్యోగులు దుర్మార్గ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇందులో ముఖ్య కారణంగా “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్” (AI) ప్రభావాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. 2025 ప్రారంభం నుంచే లే ఆఫ్స్ మోత మోగుతోంది.
మైక్రోసాఫ్ట్, ఇంటెల్ దెబ్బకు భారీగా ఉద్యోగ కోత
ఇటీవలే మైక్రోసాఫ్ట్ సంస్థ (Microsoft) 9,100 మంది ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడించింది. అదే తరహాలో ఇంటెల్ సంస్థ ఈ నెలలోనే దాదాపు 20% ఉద్యోగాలను తగ్గించేందుకు సిద్ధమవుతోంది. ఇది వేలు లెక్కల ఉద్యోగాలను ప్రభావితం చేస్తోంది. పరిశ్రమలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, అమెజాన్, గూగుల్, మెటా వంటి దిగ్గజ సంస్థలు కూడా త్వరలోనే ఉద్యోగుల్లో కోత విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఎంటర్‌ప్రైజ్ సేవలు, క్లౌడ్ విభాగాలు, డేటా అనలిటిక్స్ వంటి రంగాల్లో ఇది ప్రభావాన్ని చూపుతోంది.
ఏఐ, ఆటోమేషన్ దెబ్బకు లక్ష ఉద్యోగాలకు కోత
ఈ ఏడాది మొత్తంగా చూస్తే, ఇప్పటి వరకు లక్షకు పైగా ఉద్యోగాలు కోల్పోయినట్లు అంచనా. కంపెనీలు తమ వ్యయాలను తగ్గించడంలో భాగంగా ఏఐ ఆధారిత టూల్స్, ఆటోమేషన్ పరిజ్ఞానాన్ని పెరిగించడంతో మానవ శక్తిపై ఆధారపడే ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. పనితీరు మెరుగుదల పేరుతో సాంకేతిక మార్పులు తీసుకువచ్చిన సంస్థలు, అదే సమయంలో అనేక మంది ఉద్యోగులను విడిపించడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇది కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా, మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్, కంటెంట్ క్రియేషన్ వంటి విభాగాలపై కూడా ప్రభావం చూపుతోంది. AI ఎదుగుదలతో పాటు, ఉద్యోగ భద్రతపై ఈ ప్రభావం పునరాలోచనకు దారి తీస్తోంది.
Read Also : Minister Seethakka : అంగన్వాడీ హెల్పర్లకు శుభవార్త