సమీప కాలంలో కొన్ని వార్తా ఛానళ్లలో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. పాఠశాలలు, కార్యాలయాలు, ఫంక్షన్ హాళ్ల వద్ద విక్రయించే సమోసా, జిలేబీ, వడాపావ్ (Samosa, Jalebi, Vadapav) వంటకాలపై నూనె, చక్కెర శాతం చూపించే బోర్డులు ఉండాల్సిందిగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Union Ministry of Health) ఆదేశాలు జారీ చేసింది అన్నది ఆ వార్తల సారాంశం.అయితే, కేంద్రం దీనిపై స్పష్టత ఇచ్చింది. ఈ వార్తల్లో నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఇటువంటి ఆదేశాలు ఎక్కడా జారీ కాలేదని, ఎలాంటి నిర్దిష్ట ఆహారాలను కేంద్రం లక్ష్యంగా పెట్టలేదని స్పష్టం చేసింది.

పౌరుల ఆరోగ్యం కోసం మాత్రమే సూచనలు
కేవలం ప్రజల ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు సాధారణ ఆరోగ్య సలహాలను మాత్రమే కేంద్రం ఇచ్చినట్లు వెల్లడించింది. సమోసా, వడాపావ్, జిలేబీ లాంటి ప్రసిద్ధ వంటకాల పేర్లు ప్రత్యేకంగా ఎక్కడా ప్రస్తావించలేదని వివరించింది.ఈ సూచనలు వీధి ఆహార వ్యాపారాలను నిరోధించేందుకా? అనే అనుమానాలపై కూడా కేంద్రం స్పష్టత ఇచ్చింది. వీధి ఆహార సంస్కృతిని లక్ష్యంగా చేసుకోలేదని, ఎటువంటి కఠిన ఆదేశాలు జారీ చేయలేదని చెప్పింది.
సిగరెట్ హెచ్చరికల మాదిరిగా చిట్కాలు అవసరమా?
సిగరెట్ పెట్టెలపై ఉండే హెచ్చరికల మాదిరిగా, ఈ ఆహార పదార్థాలపై కూడా చక్కెర, నూనె శాతం చూపించాలని నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు నిరాధారం అని పీఐబీ స్పష్టం చేసింది. వాటిని నిర్దేశించడానికి కేంద్రానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేసే ఆలోచన లేదని తేల్చిచెప్పింది.ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో కేంద్రం పౌష్టికాహారాన్ని ప్రోత్సహించే సూచనలు మాత్రమే చేసింది. జీవనశైలిని మెరుగుపర్చేందుకు పౌరులను స్ఫూర్తిపరచాలనే ఉద్దేశంతోనే ఈ సూచనలు ఉన్నాయని తేల్చింది.
Read Also : Chandrababu : ముగిసిన అమిత్ షా, చంద్రబాబు మీటింగ్