తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) (KCR) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శరీరంలో నీరసం రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన హైదరాబాద్ సోమాజీగూడా యశోద ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రికి చేరిన వెంటనే వైద్యులు కేసీఆర్‌ను పరీక్షించారు. ప్రాథమికంగా నిర్వహించిన రక్త పరీక్షల్లో బ్లడ్ షుగర్ స్థాయులు అధికంగా, సోడియం స్థాయులు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇది ఒక సాధారణ అస్వస్థతగా చెబుతున్నారు.ఈ పరిణామాలపై యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు (Doctors at Yashoda Hospital released a health bulletin). కేసీఆర్ ఆరోగ్యంపై ప్రజల్లో ఆందోళన అని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. తగిన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

సీఎం కాలినడకే వచ్చారు – అభిమానులకు ఊరట
ఆసుపత్రికి తరలించబడ్డా, కేసీఆర్ స్వయంగా కాలినడకన వెళ్లడం అందరికీ ఊరట కలిగించింది. ఆయనకు తక్షణమే వైద్యం అందించడంతో పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చిందని సమాచారం.వైద్యుల సూచన మేరకు కేసీఆర్ ప్రస్తుతం ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. మరో రెండు రోజులు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండనున్నారు. అనంతరం ఆరోగ్య స్థితిని బట్టి డిశ్చార్జ్ చేయనున్నట్టు తెలుస్తోంది.
బీఆర్‌ఎస్ శ్రేణుల్లో కలకలం – పార్టీ కార్యకర్తల్లో ఆందోళన
కేసీఆర్‌కు అస్వస్థత సమాచారం తెలిసిన వెంటనే బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ శీఘ్ర కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Read Also : Shubhamshu Shukla : అంతరిక్షంలో ఆహారం, నిద్ర ఎలా ?